ఆలూరు సబ్ స్టేషన్ పరిధిలోని వాహనంలో మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్పరి మండలం, యాటకల్ నుండి తోగరగల్లు వెళ్ళు బండి రస్తాలో వంక వద్ద కర్నూల్ జిల్లా డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ ఇ.నరసానాయుడు తన సిబ్బందితో తనిఖీలు చేస్తున్నసమయంలో ఈ వాహనం పట్టుబడింది…
మినీవ్యాన్ లో కర్ణాటక రాష్ట్రంకు చెందిన 80 మద్యం బాక్సులు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.అందులో ఉన్న హోలగుంద మండలంకు కే.మంజునాథ అరెస్టు చేశారు.. డ్రైవర్ తౌసీఫ్ అలియాస్ సమూద్ పరారయ్యాడు. ఈ మద్యం విలువ రూ.4. 84 లక్షలు. . ఇక కేసులను నిందితుడైన మంజునాథను రిమాండ్ కి తరలించారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడానికి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి నాగరాజు ,కర్నూల్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్, డివిజనల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో రెండు టీములను ఏర్పాటు చేశారు. ఈ తనిఖీలలో ఎస్సై సబ్ ఇన్స్పెక్టర్ వీరాస్వామి, హెడ్ కానిస్టేబుల్ లు వెంకటరాముడు, రాముడు, ఈసీ లు షెక్షవలి, నాగరాజు, బషీర్ , కరుణాకర్ పాల్గొన్నారు.