Friday, November 22, 2024

Andhra Pradesh – ఎస్ ఐ ఫ‌లితాల‌ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

అమ‌రావతి… ఎస్ ఐ నియ‌మాకాల ఫ‌లితాల‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది… త‌మ ఎత్తు కొల‌త‌ల‌ విష‌యంలో అన్యాయం జ‌రిగిందంటూ దాఖ‌లైన పిటిష‌న్ ను విచార‌ణ అనంత‌రం కొట్టివేసింది..కాగా, ఎస్సై నియామకాల్లో ఎత్తు కొలతల అంశంలో అవకవతకలపై దాఖలైన పిటిషన్​పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎత్తు కొలతల అంశంలో అభ్యంతరం వ్యక్తం చేసిన అభ్యర్థులకు న్యాయమూర్తి సమక్షంలో పరీక్షలు నిర్వహించారు. అయితే రిక్రూట్​మెంట్​ బోర్డు కొలతలు.. న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించిన కొలతలు సరిపోవడంతో.. అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రిక్రూట్​మెంట్​పై విధించిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది.

ఉత్తర్వులను ఎత్తేసిన నేపథ్యంలో ఫలితాలను విడుదల చేసుకోవచ్చని రిక్రూట్​మెంట్​ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇది ఇలా ఉంటే పిటిషనర్​ తరపున వాదనలు వినిపించిన న్యాయవాజది జడ శ్రావణ్​ కుమార్​ 2019లో ఎత్తు అంశంలో అర్హత సాధించారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2019లో అర్హతగా పరిగణలోకి తీసుకున్న అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్స్​ను న్యాయస్థానానికి అందించారు. దీంతో అభ్యర్థుల మెడికల్​ సర్టిఫికెట్స్​ పునః పరిశీలన చేసి వారం రోజుల్లో కోర్టు ముందు ఉంచాలని రిక్రూట్​మెంట్​ బోర్డు అధికారులను హైకోర్డు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వారం రోజులకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement