Tuesday, November 19, 2024

Andhra Pradesh – ఇడుపుల‌పాయ ట్రిపుల్ ఐటిలో గంజాయ్ క‌ల‌క‌లం

లోకేష్ దృష్టికి తెచ్చిన త‌ల్లిదండ్రులు
వెంట‌నే స్పందించిన మంత్రి
ఏ విద్యా సంస్థ‌ల‌లోనూ గంజాయ్ క‌నిపించ‌కూడ‌దు
సంబంధింత అధికారుల‌కు ఆదేశాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి కలకలంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ఆదేశించారు. గంజాయిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు అమ‌రావతిలో నేడు జ‌రిగిన ప్ర‌జాద‌ర్బార్ లో మంత్రి లోకేశ్ ను కలిశారు. తమ పిల్లలను చేర్పించి నష్టపోతున్నామంటూ వారు వాపోయారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని తెలిపారు.

- Advertisement -

దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. గంజాయి నిర్మూలనకు ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని అన్నారు. ట్రిపుల్ ఐటీలో సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్ ను కాపాడతానని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement