Tuesday, November 26, 2024

ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు ?

ఏపీలో కర్ఫ్యూను మరోసారి పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇంకొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.  సోమవారం కోవిడ్  పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కర్ఫ్యూ కొనసాగింపు పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కోవిడ్ తీవ్రంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. తూర్పుగోదావరి, చిత్తూరులో అధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ఫ్యూను కఠినంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుదని తెలుస్తోంది.

 రాష్ట్రంలో కేసులు తగ్గాలంటే 4 వారాలు కర్ఫ్యూ ఉండాలని ఇటీవలే సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ పెట్టి 10 రోజులే అయ్యిందని.. పరిస్థితి అదుపులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందన్నారు. గ్రామాల్లో కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు.  గడిచిన వారం రోజులుగా 15 వేల పై చిలుకు కేసులు నమోదు అవుతునున్నాయి. అదే సమయంలో ప్రతి రోజ వందకు తగ్గకుండా మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రాల్లో జూన్ 30 వరకు లాక్ డౌన్ విధించాలని కేంద్రం కూడా సూచించింది. అయితే, లాక్ డౌన్ విధించే అధికారం రాష్ట్రాలకే ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో కర్ఫ్యూను మరి కొన్ని రోజులు పొడింగిచే ఛాన్స్ ఉంది.

అంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం కర్ఫ్యూను విధిస్తున్న విషయం తెలిసిందే. నిత్యం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 12 గంటల అనంతరం పూర్తి స్థాయిలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఆ సమయంలో ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడి ఉండటానికి వీల్లేదు. వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు వంటి వాటిని మూసివేయాలి. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement