Friday, November 22, 2024

ఏపీ సమాచార హక్కు కమిషనర్లుగా ఆ ఇద్దరు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా హరిప్రసాద్, చెన్నారెడ్డిని కమిటీ ఎంపిక చేసింది. కాబినెట్ భేటీ కంటే ముందు సచివాలయంలో సీఎం  జగన్‌ అధ్యక్షతన సమాచార కమిషన్ ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సంరద్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా హరిప్రసాద్, చెన్నారెడ్డిని కమిటీ ఎంపిక చేసింది. వీరి పేర్లను ఖరారు చేసిన ప్రభుత్వం… గవర్నర్‌ ఆమోదానికి పంపించింది. ఉల్చాల హరిప్రసాద్, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డి  ఇకపై రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలును  పర్యవేక్షించనున్నారు. ఉల్చాల హరిప్రసాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్‌ నుంచి చరిత్రలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు‌. రెండు దశాబ్దాలుగా పత్రికా రంగంలో జర్నలిస్టుగా హరి ప్రసాద్ సేవలందించారు. అలాగే కాకర్ల చెన్నారెడ్డి పోస్ట్‌ గ్రాడ్యుయేట్, లా గ్రాడ్యుయేట్‌ను అభ్యసించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కోర్టుల్లో, ఉమ్మడి హైకోర్టుల్లో గత 15 ఏళ్లుగా చెన్నా రెడ్డి న్యాయవాదిగా ఉన్నారు.

కాగా, సమావేశంలో సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక కమిటీ సభ్యురాలు, హోం మంత్రి మేకతోటి సుచరిత, కమిటీ సభ్యులు చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, స్పెషల్‌ సీఎస్‌ ప్రవీణ్‌ కుమార్,  ప్రిన్సిపల్‌ సెక్రటరీ (జీఏడి) ప్రవీణ్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement