Tuesday, November 26, 2024

AP: అనకాపల్లి విత్తన కంపెనీ మూసెయ్యాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు.. అన్ని పరిశ్రమల్లోనూ సేఫ్టీ ఆడిట్​!

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం, అనకాపల్లి జిల్లాలోని బ్రాండిక్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని విత్తన కంపెనీలో విషవాయువులు లీకవడంతో 120 మంది కార్మికులు ఆస్పత్రిపాలయ్యారు. గ్యాస్​ ఎఫెక్ట్​తో సుమారు వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో బుధవారం ఆ కంపెనీని మూసివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నోటీసు వచ్చేదాకా కంపెనీని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడంతో పాటు అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌కు కూడా ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన సమాచారం మేరకు బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై అధికారులతో సీఎం జగన్​ సమీక్షించారు.

ఇది కూడా చదవండి: PassPort: పాస్​పోర్టు కోసం దరఖాస్తు ఇట్లా చేసుకోండి.. ఆధార్​ కార్డు కంపల్సరీ కాదు!

అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కార్మికులను బుధవారం మంత్రి అమర్‌నాథ్‌ పరామర్శించారు. క్యాంటీన్‌కు వెళ్లినప్పుడు మంటలు చెలరేగాయని గ్యాస్‌ లీక్‌తో బాధపడుతున్న మహిళలు చెప్పారు. దీంతో తమకు కళ్లలో చికాకు, వాంతులు, వికారం వంటి విపరీత పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. జూన్ 3వ తేదీన కూడా అదే స్థలంలో ఇట్లాంటి ఘటనే జరిగింది. కండ్ల మంటలు, వికారం, వాంతులు అయ్యాయని కొంతమంది ఫిర్యాదు చేశారు. అప్పుడు 300 మందికి పైగా మహిళా కార్మికులు అపస్మారక స్థితికి చేరారు. ఈ ఘటన తర్వాత మరోసారి అదే చోట మళ్లీ గ్యాస్​ లీకేజీ ఘటన జరగడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement