Thursday, November 21, 2024

Andhra Pradesh – విశాఖలో కిష్కంధ కాండ! పోలీసులపై తగ్గేదేలే…

(ఆంధ్రప్రభ స్మార్ట్, విశాఖ క్రైం ) – విశాఖలో నేరస్తులు బరితెగిస్తున్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా మారుతున్నారు. పలువురు రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. అసాంఘిక కార్యకలాపాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంతే కాదు పోలీసులకూ చుక్కలు చూపిస్తున్నారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై నా తిరగబడుతున్నారు. పోలీసులను బూతులు తిడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కడకు పోలీసులు అంటే భయం లేకుండా పోయింది.నేరం చేసి తప్పించుకునే ప్రయత్నంలో నేరస్తులు మరిన్ని నేరాలుగా పాల్పడుతున్నారు. చివరకు పోలీసులు కూడా ఒంటరిగా వారి దగ్గరకు వెళ్లేందుకు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై దాడులు మాత్రం ఆగడం లేదు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై నేరస్తులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ దాడులలో పోలీసులకు కూడా గాయాలు అవుతున్నాయి.

ఈ ఘటనలను సీపీ ఖండిస్తున్నప్పటికీ కింద స్థాయి సిబ్బందిపై మాత్రం మెతక వైఖరి ప్రదర్శిస్తూ పై అధికారులపై మాత్రం సవతి ప్రేమను ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు కింద స్థాయి సిబ్బందిపై సస్పెన్షన్లు, పనిష్మెంట్లు తప్పడం లేదు. ఒక రకంగా సిబ్బందిపై సీపీ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మొన్న 3 టౌన్ కానిస్టేబుల్ అప్పారావు పై దాడి నేడు ఎంవీపీ కానిస్టేబుల్ పై దాడి పోలీస్ శాఖను ఇబ్బంది పెడుతుంది. ఇదిలా ఉంటే చిన వాల్తేరు లో మద్యం మత్తులో ఒక వ్యక్తి వీరంగం సృష్టించడం స్థానికంగా సంచలనం రేపింది. నడి రోడ్డుపై కానిస్టేబుల్ పై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.
అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి యత్నం చేసాడు ఆ వ్యక్తి భార్యాభర్తల వివాదం నేపధ్యంలో డయల్ 112 కు కాల్ రావడంతో స్పందించి అక్కడికి వెళ్లి ప్రశ్నించిన బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ రాజుల నాయుడు పై వినయ్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అతనిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించి దాడికి గురైన కానిస్టేబుల్ రాజుల నాయుడు కు తీవ్రంగా గాయపడ్డాడు. అయిదుగురు పోలీసులు రంగంలోకి దిగినా బూతులతో వీరంగం సృష్టించాడు ఆ వ్యక్తి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

- Advertisement -

◆నేరస్థుల వీరంగం..

నగరంలో నేరస్తులు వీరంగం సృష్టి స్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. నగరంలో పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, ఆకతాయిలు బరితెగింపు పెరిగిపోయింది. మహిళలను టార్గెట్ చేస్తూ వారిపై దాడులకు తెగబడుతున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.

◆ పోలీసుల మెతక వైఖరి..

పోలీసులు వీరు పట్ల వ్యవహరిస్తున్న మెతక వైఖరి తీరు వలన నేరస్తులు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో అతి వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో అదే స్థాయిలో నేరాలు కూడా పెరుగుతూ ఉండటం విశేషం. నేరస్థులపై ఉక్కు పాదం మోపుతున్నామంటూ ఒకపక్క సిపి చెబుతున్నప్పటికీ కూడా నగరంలో నేరాల నియంత్రణ మాత్రం ఆగడం లేదు. ఎప్పటికప్పుడు నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది.
నేరస్తులు ఇప్పుడు తమ రూట్ మార్చి చివరికి పోలీసులు పైన దాడులకు తెగబడుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఇప్పటికైనా నేరస్థులపై దృష్టి సారించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement