Friday, November 22, 2024

Andhra Pradesh – ఘ‌ర్ష‌ణ‌ల‌పై ఈసీ సీరియ‌స్…బాధ్యుల‌పై చ‌ర్య‌ల‌కు ఆదేశం..

అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి, పల్నాడు జిల్లా మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దాడులకు పాల్పడిన వారిపై గృహనిర్బంధంతో పాటు కేసులు పెట్టాలని ఈసీ ఆదేశించింది. పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని ఆదేశించింది. సాయంత్రం 4-6 గంటల మధ్య ఎలాంటి ఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

ఏపీలో శాంతిభధ్రతలు విఫలం: ఈసీకి టిడిపి ఫిర్యాదు

- Advertisement -

ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఉదయం నుంచి ఏపీలో 120కి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని టిడిపి మాజీ ఎంపీ కనక మేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ వేళ శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. ఈమేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాసిన లేఖతో పాటు మరో 11 ఫిర్యాదులను కనకమేడల ఈసీకి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”అన్ని చోట్లా వైకాపా నేతలు హింసకు పాల్పడుతున్నారు. తెదేపా కార్యకర్తలు, ఏజెంట్లు, నేతలపై దాడి జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు సహకరిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వైకాపా అభ్యర్థులు, నేతలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి.

తెనాలి, తాడిపత్రి, నరసరావుపేట వైకాపా అభ్యర్థులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పల్నాడు, తాడిపత్రి, పులివెందుల సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. పలుచోట్ల పోలింగ్‌ నిలిపివేయడం దారుణం. ఈవీఎంలు ధ్వంసం చేసి, పలు చోట్ల ఓట్లు వేయకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. శాంతిభద్రతల పరిణామాలు, ఓటింగ్‌ తీరు ఆందోళన కలిగిస్తోంది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో మరోసారి పోలింగ్‌ నిర్వహించాలని కోరాం” అని కనకమేడల తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement