Friday, November 1, 2024

Andhra Pradesh – టొర్నడో బీభత్సం – మైచాంగ్ తుది విన్యాసం

ఆంధ్రప్రదేశ్​లో మైచాంగ్ బీభత్సం సృష్టించింది. అమెరికా తరహాలో టోర్నాండోల అనుభవాన్ని ఏపీ ప్రజలు చూశారు. ఇది చూసిన జనం భయంతో పరుగులు పెట్టేశారు. అకస్మాత్తుగా భీకర సుడిగాలి జనం గుండెల్లో కలవరం సృష్టించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సుడిగాలి వికటట్ట హాసంతో కరాళ నృత్యం చేసింది. కోనసీమ జిల్లాలోని గండేపల్లి మండలం మల్లేపల్లి శివారు జాతీయ రహదారి పక్కన పెట్రోల్‌ బంకు ఎదురుగా ఈ సుడిగాలి ఎగిసింది. కొద్దిదూరం దూసుకెళ్లిన సుడిగాలి, స్థానికుల గుండెల్ని కుదిపేసింది. సుడిగాలి తీవ్రతకు రహదారిపై ఆటోలు గాలిలో ఎగిరి కొట్టుకుపోయాయి.

బంకు నుంచి పారిపోయిన జనం.. కొట్టుకుపోయిన వాహనాలు
సుడిగాలి తమ వైపు వస్తోందని పెట్రోల్ బంకులోని ఉద్యోగులు పరుగులు తీశారు. ఇక అన్నవరం రైల్వే గేటు వద్ద సమీపంలోను సుడిగాలి బీభత్సం సృష్టించింది. సుడిగాలి దాటికి రైల్వే గేటు సమీపంలో ఆగిన వాహనాలు చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి. సుడిగాలి దాటికి ఓ ఆటోతో పాటుగా, టాటాఏస్ వాహనం ఎగిరిపడ్డాయి. దీంతో ఆటోలోని ఇద్దరు గాయపడ్డారు. మరో ప్రాంతంలో విద్యుత్తు తీగలు తెగి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. భారీ వృక్షాలు నేల కూలాయి. రైల్వే గేట్ పక్కనే ఓ ఇంటి రేకులు సైతం సుడిగాలిలో కొట్టుకుపోయాయి. ఆ తర్వాత పంపా రిజర్వాయర్ వైపు కదలడంతో రిజర్వాయర్లోనినీరుటోర్నడోతోపాటుపైకివెళ్లింది.

రాజమహేంద్రవరంలో భయానకం..
జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో సుడిగుండం భయానక వాతావరణాన్ని సృష్టించింది.. వై-జంక్షన్, వీ ఎల్ పురం, మోరంపూడి, హుకుంపేట, ప్రకాశంనగర్, దానవాయిపేట, ఆర్ట్స్ కళాశాల పరిసరాలు, వై.జంక్షన్ తదితర చుట్టుపక్కల ప్రాంతాల్లో టోర్నడోలు కలవరం సృష్టించాయి. భారీ సుడిగాలితో ఇళ్లు , దుకాణాలపై పైరేకులు గాల్లోకి ఎగిరి కిందపడ్డాయి. గాలి వేగానికి దుకాణాల్లో వస్తువులు బయటకు ఎగిరిపడ్డాయి. గోదావరి నదిలో సముద్ర అలలు మాదిరి ఎగిసిపడ్డాయి. జనం ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వీరభద్రపురంలో కంటిపూడి రామారావు మున్సిపల్ పాఠశాలలో నాడు-నేడు పనుల్లో భాగంగా రెండవ అంతస్తు పైన వేసిన రేకుల షెడ్డు కింద పడింది.

వాయువేగం.. సుడులు సుడులుగా గాలి..
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో. జాతీయ రహదారి 165 కు సమీపంలో వరి పొలాలలో ప్రారంభమైన సుడిగుండంవాయువేగంతో సుడులు తిరుగుతూ సుమారు రెండున్నర కిలోమీటర్లు బీభత్సం సృష్టించింది. వీరవాసరం, వడ్డిగూడెం, తోలేరు గ్రామాలలో భీభత్సం సృష్టించింది. ఈ టోర్నడో దెబ్బకు భారీ చెట్లు, చెరువుల లోని నీరు, మూడు ట్రాక్టర్లు, వరి కోత మిషన్, లారీ పైకిఎగిరి పడ్డాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఒక కక్కా- ముక్కా రెస్టారెంట్, ఒక రైస్ మిల్లు ధ్వంసమయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కక్కా- ముక్కా రెస్టారెంట్ పైన రేకులు ఫర్నీచర్, వంట సామాగ్రి ధ్వంసం అయ్యాయి. వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సుడిగాలి బీభత్యానికి వీరవాసరం మండలం తోలేరులో తాటాకిళ్లు కూలడంతో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.వారిని భీమవరం లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెరువు గట్టున ఏర్పాటు చేసిన విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ ఎగిరి చెరువులో పడింది

బుట్టాయ గూడెంలో విషాదం – ఇంటి కప్పు కూలి ఇద్దరి మృతి

- Advertisement -

= ఏలూరు జిల్లా బుట్టాయూగుడెం మండలం, రాజానగరంలో విషాదం నెలకొంది.మంట వేసుకొని చలికాగుతుండగా.. గురువారం రాత్రి గాలి వానకు పాక ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో పాకలో ఉన్న వెట్టి గంగ రాజు, జోడీ రాముడుమృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసుదర్యాప్తు చేపట్టారు.

= ఏలూరు జిల్లా: బుట్టాయూగుడెం మండలం, రాజానగరంలో విషాదం నెలకొంది. రాత్రి పాకలలో చలి మంట వేసుకొని ఉండగా గాలి వానకి పాక ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో పాకలో ఉన్న వెట్టి గంగ రాజు, జోడీ రాముడు అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

= ఏలూరు జిల్లా: బుట్టాయూగుడెం మండలం, రాజానగరంలో విషాదం నెలకొంది. రాత్రి పాకలలో చలి మంట వేసుకొని ఉండగా గాలి వానకు పాక ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో పాకలో ఉన్న వెట్టి గంగ రాజు, జోడీ రాముడు అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మైచౌంగ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం, కొంగవారిగూడెం వద్ద ఎర్రకాల్వ జలాశయానికి రికార్డ్ స్థాయిలో వరద నీరు పెరుగుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా.. ప్రస్తుతం 82.68 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement