Tuesday, November 19, 2024

Andhra Pradesh – లీవ్ లో సిఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి … కొత్త సిఎస్ గా విజ‌యానంద్ కు అవ‌కాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ లలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీకాలం జూన్ నెలాఖరుకు ముగియ‌నుంది.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నేడు ఈ నెల‌ఖ‌రు వ‌ర‌కూ సెల‌వు కోసం ద‌ర‌ఖాస్తు చేశారు.. దీనిని వెంట‌నే అమోదించే అవ‌కాశాలున్నాయ‌ని ఉన్న‌తాధికారుల నుంచి స‌మాచారం ..


ఈ నేపథ్యంలో తాత్కాలిక కొత్త సీఎస్ గా విజయానంద్ నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్‌ గత ప్రభుత్వం లో ప్రధాన కార్యదర్శి పదవిని కొన్ని రోజులు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు.

బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గా, ఏపీ ట్రాన్స్ కో , ఏపీ జెన్ కో సీఎండీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటి మంత్రిత్వ శాఖల ముఖ్యకార్యదర్శి(ప్రిన్సిపల్ సెక్రెటరీ)గా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాత్కాలికంగా ఇప్పుడు ఆయ‌న నియ‌మితులైనా కొత్త ప్ర‌భుత్వం కొలువుతీరిన త‌ర్వాత ఆయ‌ననే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

- Advertisement -

ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాల సుబ్ర‌హ్మ‌ణ్యం ..

ఇక ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాలసుబ్రమణ్యం పేరు పరిశీలనలో ఉంది. గత 3 సంవత్సరాలుగా సెలవులో ఉన్నారు.. జ‌గ‌న్ స‌ర్కార్ లో ఇమ‌డ‌లేక సెల‌వులోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్నారు… నిజాయితీ అధికారిగా పేరు ఉన్న బాల సుబ్ర‌హ్మ‌ణ్యంకు ఐబి చీప్ ఇచ్చే అవ‌కాశాలున్నాయ‌ని ఐపిఎస్ అధికారులు అంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement