Friday, November 22, 2024

Andhra Pradesh – పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రత్యేక కృషి – సీఎస్‌ జవహర్‌ రెడ్డి

అమరావతి, ఆంధ్రప్రభ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్‌.జవహర్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం విజయవాడ సిఎస్‌ క్యాంపు కార్యాలయంలో ఎంఎస్‌ఎంఇ కార్యక్రమం కింద నమోదైన వివిధ రకాల యూనిట్లు- వాటి ప్రగతిని పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలున్నందున ఆయా యూనిట్లను ఏర్పాటు- చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు తగిన తోడ్పాటు-ను అందించి సకాలంలో యూనిట్లు- ఏర్పాటు- అయ్యేలా చూడాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. అదే విధంగా కొప్పర్తి, గుంటూర్లలో ఏర్పాటు- అవుతున్న ఎంఎస్‌ఎంఇ -టె-క్నాలజీ కేంద్రాల ప్రగతిని సిఎస్‌ జవహర్‌ రెడ్డి తెలుసుకున్నారు. అలాగే ఎంఎస్‌ఎంఇ రంగానికి సంబంధించిన సేవలను మరింత సులభతరం చేసేందుకు రూపొందిస్తున్న వైయస్సార్‌ ఎపి ఒన్‌ ఫ్లాట్‌ ఫారమ్‌ గురించి ఆయన సమీక్షించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్‌.యువరాజు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎంఎస్‌ఎంఇ రంగంలో చేపట్టిన పలు ఇనిషియేటివ్స్‌ పై వివరించారు. సమావేశంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఎంఎస్‌ఎంఇ సిఇఓ, పరిశ్రమల శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌, జెడి. రామలింగేశ్వర రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement