Monday, November 25, 2024

కరోనా అప్ డేట్ః ఏపీలో కొత్తగా 106 మంది మృతి

ఏపీలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,284 కరోనా కేసులు నమోదుకాగా, 106 మంది మరణించారు. అదే సమయంలో 20,917 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 16,09,105కి కరోనా కేసులు చేరగా..మొత్తం 10,328 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,98,023 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 14,00,754 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 15 మంది, ప్రకాశం జిల్లాలో 11, పశ్చిమగోదావరి జిల్లాలో 10 మంది మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో 9 మంది చొప్పున చనిపోయారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందగా, శ్రీకాకుళం జిల్లాలో 7, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున కన్నుమూశారు. కడప జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.  

ఇక అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2663 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం 134, చిత్తూరు 1970, కర్నూలు 1387, విశాఖ 1840, శ్రీకాకళం 991, పశ్చిమగోదావరి జిల్లాలో 1412, గుంటూరు 802, ప్రకాశం 978, కడప 436, కృష్ణ 568, విజయనగరం జిల్లాలో 555 కేసులు నమోదు అయ్యాయి.

ఇదీ చదవండి : ఈనెల 28న జీఎస్టీ మండలి సమావేశం.. వ్యాక్పిన్‌లపై పన్ను తగ్గిస్తారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement