ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే, గత రెండు రోజులతో పోలిస్తే తాజా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. అదే సమయంలో కరోనా చనిపోతున్న వారి సంఖ్య అధికం అవుతోంది. గడచిన 24 గంటల్లో 91,629 కరోనా పరీక్షలు నిర్వహించగా 18,767 మందికి పాజిటివ్ అని తేలింది. వైరస్ కారణంగా 104 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,887 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో2323, పశ్చిమగోదావరిలో 1972, అనంతపురం1846, గుంటూరు 1249, కర్నూలు1166, నెల్లూరు 1045 కేసులు నమోదు అయ్యాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో 2 వేలకు లోపే కొత్త కేసులు వచ్చాయి. ఇక, చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, విజయనగరం జిల్లాలో 11 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 10,126కి పెరిగింది. ఇప్పటి వరకు 15,80,827 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 13,61,464 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,09,237 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో కరోనా కట్టడికి కర్ఫ్యూ అమలు చేస్తున్న వైరస్ తగ్గడం లేదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement