తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు టిడిపి అధినేత చంద్రబాబు.. అలాగే పల్నాడు, తాడిపత్రిలో కూడా వైసిపి నేతలు, కార్యకర్తలు యదేచ్చగా దాడులకు పాల్పొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ దాడులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా ఎపి డిజిపికి ఆయన కోరారు.. హింసాత్మక సంఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు తక్షణం అదనపు బలగాలను తరలించాలని డిజిపికి విజ్ఞప్తి చేశారు.. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా . ఓటమికి భయపడిన పిరికిపందలే దాడులు చేస్తున్నారన్నారు… తిరుపతి స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు రక్షణ ఏది? అని ప్రశ్నించారు.. నిన్న పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారన్నచంద్రబాబు . పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారన్నారు. పోలింగ్ అనంతరం దాడులను నివారించడంలో… ప్రజలకు, ప్రతిపక్షాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం అవుతున్నారంటూ ఆరోపించారు..
మరోవైపు మాచర్లలో ఇప్పుడు కూడా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు.. తాడిపత్రిలోను దాడులు నిరాటంకంగా సాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసుల తీరు సరిగా లేదని వాపోయారు. ఎన్నికల సంఘం, డీజీపీ, ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
దాడులను ఖండించిన నారా లోకేష్
చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై వైకాపా మూక దాడిని ఖండించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజమని అంటూ అపజయం తప్పదనే సంకేతాలతో
వైసిపి తన ఫ్యాక్షన్ విషసంస్కృతికి తెరలేపిందని ఫైర్ అయ్యారు. . పద్మావతి మహిళ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైకాపా మూక దాడి దిగ్భ్రాంతికి గురిచేసిందననారు. . నాని అన్నతో మాట్లాడానని, . గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించానన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.