Wednesday, November 20, 2024

Andhra Pradesh – నాలుగో సారి ముఖ్యమంత్రి … రికార్డులు కొట్టిన చంద్రబాబు

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం ఓ రికార్డు కాగా.. ఆయన మంత్రి మండలి కూడా నయా చరిత్రను సృష్టించింది. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయటంతో.. సీబీఎన్ 4.0 రికార్డు ఆయన సొంతమైంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 41 ఏళ్ల కిందటి చరిత్రను చంద్రబాబు తిరగరాశారు. 1983లో టీడీపీ ఆవిర్భవించటంతో 193 మంది కొత్త నాయకులు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా.. 15 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో నాదెండ్ల భాస్కరరావు మాత్రమే సీనియర్ కావటం విశేషం.

కొత్త ఎమ్మెల్యేలు 10 మందికి మంత్రి ప‌ద‌వులు

తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా… కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవుల కేటాయింపులో చంద్రబాబు కొత్త రికార్డును సృష్టించారు. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయిస్తే ఇందులో 10 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినోళ్లే. మిగిలిన ఏడుగురిలో నలుగురు మాజీ మంత్రు పదవులే . మంత్రులుగా ప్రమాణం చేసిన ఇక జనసేన, బీజేపీ మంత్రులంతా నయా ఎమ్మెల్యే..

- Advertisement -

4.0 సీఎంగా బాబు రికార్డు

నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. అభవిక్త ఆంధ్రప్రదేశ్లో మూడు సార్లు సీఎంగా ఎన్టీఆర్ హిస్టరీ సృష్టిస్తే… ఆ తరువాత నీలం సంజీవ రెడ్డి, మర్రి చెన్నా రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిరెండు సార్లు ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఇక తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, నేదురుమల్లి జనార్థనరెడ్డి , కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కొక్కసారి ముఖ్యమంత్రులుగా పని చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement