ఆంధ్రప్రభ స్మార్ట్ , విజయవాడ ప్రతినిధి: ఏపీ సీఎం చంద్రబాబు… జనం బాబుగా మారి.. తన మార్క్ పాలన అందించేందుకు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను దృష్టిలో పెట్టుకుని, ఈ సారి సచివాలయం కేంద్రంగా పాలన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సెక్రటేరియెట్‌లోనే అందుబాటులో ఉంటానంటూ తనను కలిసిన పలువురు ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. గతంలోసచివాలయంలోనే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారట. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తారట.
మినిస్టర్లూ.. సెక్రటెరియేట్ లోనే..
సెక్రటెరియేట్ నుంనే విధులు నిర్వహించాలని మంత్రులకూ సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ప్రతి రోజూ సచివాలయానికి మంతులు రావాలని, అదేవిధంగా సమయపాలన కచ్చితంగా పాటించాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని, పరిపాలన పరంగా సంపూర్ణ అవగాహన పొందాలని సూచించారు. ప్రతిరోజు తమ శాఖల అధికారులతో సమీక్ష చేయాలని, రోజు కో మంత్రి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాని ఈ మేరకు మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారని సమాచారం.