Tuesday, November 19, 2024

Andhra Pradesh – ఆరోగ్య‌క‌రమైన స‌మాజం ఉంటేనే దేశాభివృద్ధి – కేంద్ర‌మంత్రి మాండ‌వీయ‌

విజయవాడ, గుంటూరు జిల్లాల్లో నేడు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటించారు. విజయవాడలోని ఓల్డ్ జీజీహెచ్ లో క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంత‌రం గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంను ఆయన పరిశీలించారు. అనంతరం మంగళగిరి ఎయిమ్స్ సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజం దేశాన్ని సమృద్ధిగా మారుస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో 10 రకాల టెస్టులు జరుగుతాయని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు.

ఆసుపత్రులు కట్టినా డాక్టర్లు ఉండాలని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని మాండవీయ చెప్పారు. దేశంలో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ‌,ప్రైవేటు మెడిక‌ల్ క‌ళాశాల‌లో ల‌క్షా ఏడు వేల సీట్లు దేశంలో ఉన్నాయ‌న్నారు.. అలాగే 3 నుంచీ 4 లక్షలు టెలి కన్సల్టేషన్లు దేశం అంతా జరుగుతున్నాయి.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆధునిక భారత నిర్మాణం జరుగుతోంది అని ఆయన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ ఏపీలో చాలా బాగా పని చేస్తోంద‌ని పేర్కొన్నారు.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్ధాయి మద్దతు ఉంటుంద‌ని,, రాష్ట్రం ఆరోగ్య సేవలకు చేసే ఖర్చుకు నిధులు ఇవ్వడానికి కేంద్రం వెనుకాడబోదు అని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement