Friday, November 22, 2024

Andhra Pradesh – హోదాకి వెలుగులు .. విభ‌జ‌న హామీలు నెర‌వేర్చే దిశ‌గా కేంద్రం అడుగులు ..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఇప్పటి వరకు ప్రత్యేక హోదా సాధ్యంకాదని కేంద్ర పెద్దలు తేల్చిచెప్పిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్యాకేజీని అమలు చేయాల్సిందిగా ఢిల్లి వెళ్లిన ప్రతిసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి కేంద్రానికి విన్నవిస్తు న్నారు.. విభజన హామీలను కూడా నెరవేర్చాలని ఒత్తిడి తెస్తున్నారు. విభజన సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయో జనాలపై కేంద్రంతో సంప్రతింపులు జరుపుతున్నారు. ప్రత్యేక హోదాతో పాటు కడప లో స్టీల్‌ ప్లాంట్‌, గిరిజన, పెట్రోలియం విశ్వవిద్యాలయాలకు అనుమతులు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ పునరుద్ధరణ అన్నింటికీ మించి పోలవరం అంచనాల సవరణలపై గత రెండేళ్లుగా ఢిల్లిd పెద్దలతో మంతనా లు సాగిస్తున్నారు. విభజనానంతరం ఏపీ రెవెన్యూలోటును భర్తీ చేస్తామని ప్రకటించిన కేంద్రం ఇటీవలే 10వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన సంగతి విదితమే. దీంతో పాటు గత ఆరు నెలలుగా ఆర్థికంగా రాష్ట్రం పుంజుకునేందుకు అవసరమైన రుణ పరపతికి కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తోంది. వి భజన హామీలు నెరవేర్చక పోగా విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకర ణకు కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్రంలో వ్యతిరేకత వ్యక్తమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించాలనే వ్యూహంతో పావులు కదుపుతున్న కేంద్రంలోని బీజేపీకి ఇటీవల కర్నాటక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. మరోవంక తెలంగాణ, తమిళనాడు, కేరళలో బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే (రాజకీయంగా మినహా) అంశాల వారీ మద్దతు ఇస్తుండటంతో విభజన హామీల అమలుపై కేంద్రం ఫోకస్‌ పెంచినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని సీఎ ం జగన్‌ ఢిల్లిd వెళ్లిన ప్రతి సందర్భంలో ప్రధానికి, అమిత్‌షాకు అందించే వినతిపత్రాల్లో ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈసారి విభజన హామీలపై కీలక ప్రకటన చేసేలా కేంద్రంపై సీఎం జగన్‌ ఒత్తిడి తేనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా ఈనెల 5, 6 తేదీల్లో ఢిల్లిdకి బయల్దేరి వెళ్లనున్నారు. గత వారమే పర్యటనకు సిద్ధమైనప్పటికీ ప్రధాని మోడీ, అమిత్‌ షాల అపాయింట్‌మెంట్లు ఆలస్యం కావటంతో వాయిదా పడింది.

ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఉక్కుగనుల శాఖ మంత్రితో పాటు జలవనరుల మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తదితరులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 6,7,8 తేదీల్లో రాయలసీమ జిల్లాల్లో పర్యటనతో పాటు 8న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు, ఆ పై అనంతపురంలో రైతు బీమా కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. ఢిల్లిd పర్యటన సందర్భంగా రైతు బీమా కార్యక్రమాన్ని 9వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కేంద్రంలోని బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మద్దతిస్తూ వచ్చింది. అయితే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాన్ని అనుసరించే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొద్దిరోజుల క్రితం ఢిల్లిdలో ప్రధాని మోడీ, అమిత్‌షాలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ, వైసీపీల మధ్య దూరం పెరిగిందని అం తా భావించారు. అయితే ఢిల్లిdలో పరిణామాలు మరోరకంగా ఉన్నాయి.

బీజేపీ హైకమాండ్‌, వైసీపీ, జగన్‌ సర్కార్‌ మధ్య లోపాయకారీ మంతనాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. రాజకీయంగా అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇటీవల రాష్ట్రానికి వచ్చి చేసిన విమర్శలు అనంతరం జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. విభజన అనంతరం గత ప్రభుత్వ హయాం నుంచి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినందున ఆర్థిక వెసులుబాటుతో పాటు ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరపతి శాతాన్ని, రాష్ట్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటాను పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌ గత కొంతకాలంగా కేంద్రాన్ని కోరుతున్నారు. తెలంగాణ నుంచి బదలాయించాల్సిన ఆస్తులు, టీఎస్‌ జెన్‌కో ఏపీకి చెల్లించాల్సిన బకాయిలపై కూడా కేంద్రం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. దక్షిణాదిలో ఏపీ నుంచి మాత్రమే కేంద్రానికి మద్దతు వస్తున్నందున రాష్ట్రానికి సంబంధించిన అన్ని విభజన హామీలను నెరవేర్చాలని తాజాగా కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement