Friday, November 22, 2024

Andhra Pradesh – చంద్రబాబు కేబినెట్ నిర్ణయాలు ఇవే …

ల్యాండ్ టైట్లింగ్యాక్ట్ రద్దుఇక భూకబ్జా నిరోధక చట్టం
తెరమీదకు ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్
కొత్త ఇసుక పాలసీకి ఓకే
పంటల బీమా పై చర్చ
త్రిసభ్య కమిటీ ఏర్పాటు
రుణసేకరణకు పౌరసరఫరాల శాఖకు అనుమతి
రూ.2000 కోట్లకు సర్కారు గ్యారెంటీ
రూ.3200 కోట్ల రుణంతో ధాన్యం కొనుగోలు
ఏపీ మంత్రి మండలి ఆమోదం

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి : ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు బిల్లుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ కేబినెట్ భేటీలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కొత్త ఇసుక పాలసీపై ప్రభుత్వం త్వరలో విధి విధానాలను రూపొందించనుంది. ఇంకా పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు సైతం మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పోరేషన్ కు ప్రభుత్వ గ్యారెంటీకి కెబినెట్ ఆమోదం తెలిపింది.

- Advertisement -

పంటల బీమా పై త్రిసభ్య కమిటీ

పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై మంత్రి మండలి చర్చించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాల ఖరారుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ భేటీ కేబినే నిర్ణయం తీసుకుంది. ముగ్గురు మంత్రులతో ఈ కమిటీని నియమించాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు.వీరు రెండు రోజుల పాటు అధికారులతో మాట్లాడి విధివిధాలను నిర్ణయించనున్నారు. ప్రీమియంను రైతులు స్వచ్ఛందంగా చెల్లించాలా? లేక ప్రభుత్వం చెల్లించాలా? అనే అంశాన్ని ఖరారు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కేవలం రెండు రోజుల్లోనే నివేదికను వీరు ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఓకే

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ సహా వేర్వేరు అంశాలపై రాష్ట్ర కేబినెట్ చర్చించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింపు సహా వివిధ అంశాలపై రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన ఒటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జూలై నెలాఖరుతో ముగుస్తోంది. ఆగస్టు1 తేదీ నుంచి రెండు నెలల కాలానికి ఈ బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకు సంబంధించి కూడా కేబినెట్లోచర్చించినట్ట సమాచారం. మరోవైపురాష్ట్రంలోనూతనఇసుకవిధానరూపకల్పనపైకూడాకేబినెట్చర్చించింది. మరో 15 రోజుల్లోగా కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు భూకబ్జాల నిరోధానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ను తీసుకువచ్చే అంశంపై కూడా కేబినెట్లోచర్చించారని తెలిసింది.

22 నుంచి అసెంబ్లీ

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా రాష్ట్ర కేబినెట్లోనిర్ణయంతీసుకున్నారు. ఈనెల22 నుంచి శాసన సభ సమావేశాలు నిర్వహించాలని , ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాల పైనా చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement