Thursday, November 21, 2024

Andhra Pradesh – బిపిసిఎల్ ప్ర‌తినిధుల‌తో చంద్ర‌బాబు భేటి

రాష్ట్రంలో పెట్రో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుపై చ‌ర్చ‌లు
ఎపిలో 60 కోట్ల‌తో రిఫైనరీ ఫ్యాక్ట‌రీ
ఇప్ప‌టికే అంగీక‌రించిన కేంద్రం
ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నే దానిపై చ‌ర్చ‌లు

ఏపీ సీఎం చంద్రబాబు తో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ప్రతినిధులు భేటీ అయ్యారు. బీపీసీఎల్‌ ఛైర్మన్‌, ఎండీ కృష్ణకుమార్‌, సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. రాష్ట్రంలో పెట్రోల్‌ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. సుమారు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం, బీపీసీఎల్ మధ్య సంప్రదింపులు జరిగినట్లు సమాచారం.
ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటుచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బీపీసీఎల్‌ ప్రతినిధులు సీఎంను కలిశారు. ప్ర‌స్తుతం ఈ ఫ్యాక్ట‌రీ ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నే అంశం పై చ‌ర్య‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం .

- Advertisement -

ఆర్థికశాఖ శ్వేతపత్రంపై సీఎం సమీక్ష

ఆర్థికశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయాలపై అధికారులను ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం రూ.14లక్షల కోట్ల వరకు ఉన్నాయని ఆర్థికశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పెండింగ్‌ బిల్లులు ఎంత ఉన్నాయనే అంశంపైనా సీఎం చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై శాఖల వారీగా వివరాలు కోరినట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ఈ సందర్భంగా ప్రతిపాదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement