Friday, November 22, 2024

Andhra Pradesh – అన్నా క్యాంటీన్ లలో మెనూ ఇదే

అయిదు రూపాయిలకే భోజనం
టిఫిన్ సైతం అయిదుకే
రేపు మొత్తం 100 ప్రాంతాల‌లో క్యాంటిన్ లు ప్రారంభం
గుడివాడ‌లో చంద్ర‌బాబు చేతుల మీదుగా శ్రీకారం
మెనూ విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
16వ తేదీ నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ క్రమంలోనే 33 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రారంభించే ఈ క్యాంటీన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా తొలి విడతలో 100 క్యాంటీన్‌లు అందుబాటులోకి రానున్నాయి.
దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో రేపు అన్నాక్యాంటీన్ ను ప్రారంభించ‌నున్నారు.

- Advertisement -

హరే కృష్ణ మూవ్ మెంట్ సంస్థకు అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ సంస్థ కేవలం మూడు గంటల్లోనే లక్ష మందికి ఆహారం సిద్దం చేసే క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఈ నేప‌థ్యంలోనే అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు.

మెనూ..ధరలు
ఇక, అన్నాక్యాంటీన్లలో ప్రతీ రోజు అందించాల్సిన మెనూ, ధరలను ఖరారు చేసారు. ఉదయం టిఫిన్, మధ్నాహ్నం భోజనం రాత్రికి డిన్నర్ ఏదైనా రూ 5 కే అందించాలని నిర్ణయించారు. ఇక, మెనూ ప్రకారం ప్రతీ సోమవారం ఉదయం టిఫిన్ గా ఇడ్లీ (చట్నీ, సాంబార్)లేదా పూరీ కూర్మాతో అందిస్తారు. లంచ్ గా వైట్ రైస్ కూర, పప్పు లేదా సాంబార్, పచ్చడి, పెరుగుతో అందుబాటులోకి తెస్తున్నారు. వారంలో ప్రతీ రోజు లంచ్,డిన్నర్ లో భాగంగా ఇదే రకంగా మెనూ ఉండనుంది. పదార్ఢాలు మాత్రం మారనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement