Thursday, November 21, 2024

Rain Alert: ఏపీకి తుపాను ముప్పు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉంది. దక్షిణ థాయిలాండ్‌ వద్ద అండమాన్ సమీపంలో నిన్న మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా ఏపీ, ఒడిశా తీరం వైపుగా దూసుకొస్తోంది. నిన్న సాయంత్రానికి నెల్లూరు తీరానికి 1,400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపటికి ఇది వాయుగుండంగా మారుతుందని, ఈ నెల 3న తుపానుగా బలపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 4న ఉత్తరాంధ్ర, ఒడిశా తీరానికి చేరుకుంటుందని పేర్కొంది. ఈ నెల 5, 6 తేదీల్లో తీవ్ర తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తుపానుగా బలపడితే దానికి ‘జవాద్’ అని పేరుపెట్టనున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో  ఇది తీవ్ర తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 2వ తేదీ నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement