Thursday, November 21, 2024

Andhra Pradesh – కూట‌మి ఎమ్మెల్యేల‌తో చంద్ర‌బాబు నేడు స‌మావేశం

వేదిక‌గా మంగ‌ళ‌గిరి సికె క‌న్వెన్ష‌న్ హాలు
హాజ‌రుకానున్న టిడిపి, జ‌న‌సేన‌, బిజెపి ఎమ్మెల్యేలు
కోనేటి ఆదిమూలం కు ఆంద‌ని ఆహ్వానం
వంద రోజుల పాల‌న‌పై స‌మీక్ష‌

అమ‌రావ‌తి – ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ కానున్నారు. నేటి సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో భేటీ ప్రారంభం కానుంది. సుమారు 3 గంటలకుపైగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

వందరోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మినహా మిగతా మూడు పార్టీల ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సారథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాలక కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. వంద రోజుల సందర్భంగా ఎమ్మెల్యేలకు వారి పనితీరుపై ప్రోగ్రెస్‌ కార్డులు తయారుచేసి ఎవరికి వారికి విడిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత భావించారు. సమయానికి అవి సిద్ధమైతే ఇవ్వాలని, లేని పక్షంలో తర్వాత ఇవ్వాలని యోచిస్తున్నారు.

ఇంకోవైపు మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జులు, వైసీపీ గెలిచిన స్థానాల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. త్వ‌ర‌లోనే ఈ స‌మావేశ తేదిని ఖ‌రారు చేస్తామ‌ని ఆ పార్టీ ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement