Wednesday, September 18, 2024

Andhra Pradesh – ఏక కాలంలో అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు

ఎపిలో కౌంటింగ్ కు స‌ర్వం సిద్ధంమొత్తం 33 కేంద్రాల‌లో కౌటింగ్

25 లోక్ స‌భ‌, 175 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు

బ‌రిలో లోక్ స‌భ‌కు 454 మంది, అసెంబ్లీకి 2387 మంది

ఓటు హ‌క్కును వినియోగించుకున్న 81.86 శాతం మంది

పోలింగ్ కేంద్రాల వ‌ద్ద మూడంచెల భ‌ద్ర‌త

- Advertisement -

ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్స్ లెక్కింపు

జ‌గ‌న్, చంద్ర‌బాబు, ష‌ర్మిల‌, పురందేశ్వ‌రికిర‌ణ్ కుమార్ రెడ్డి, రోజా,లోకేష్ భ‌వితవ్యం తేలేది నేడే

ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మరికొద్ది గంటల్లో ఏపీలోని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆ తరువాత ఈవీఎంల కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్ ను నియమించుకునేందుకు, ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజంట్ కు అవకాశం ఉంటుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అందుకు తగ్గట్టుగా అగ్నిమాపక శాఖ నుండి దృవీకరణ పత్రాన్ని తప్పని సరిగా పొందాలని ఈసీ సూచించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.

అలాగే మూడంచ‌ల భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసింది.. సెల్ ఫోన్ లు, కెమెరాల‌ను నిషేధించింది.ఇక 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2వేల 387 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు.. రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైందని చెప్పారు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా. . పోలైన ఓట్ల‌లో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.20 శాతం మేర నమోదైనట్లు వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్‌ పెరిగిందని మీనా తెలిపారు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం నమోదైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు వివరించారు.

లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్‌సభలో 71.11 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సీఈవో చెప్పారు. జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.09 పోలింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63 శాతం ఓట్లు పోలైనట్లు వెల్లడించారు.

భారీ భ‌ద్ర‌త‌..

144 సెక్ష‌న్ నిబంధ‌న‌లు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఉంటుందని చెప్పారు. 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని అప్పటివరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

విశాఖ జిల్లాకు సంబంధించి ఓట్ల కౌంటింగ్ కు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. 21 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతోపాటు, అదనపు బలగాలు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.ఓట్ల లెక్కింపు రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా….

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏజెన్సీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి హింస జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు.

ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు భద్రతా చర్యలన్నీ చేపట్టామని విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద… లెక్కింపు సిబ్బంది, ఏజెంట్లు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులను మినహా ఎవరినీ లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.

గుంటూరు పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు….ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని 5 భవనాల్లో జరగనుందని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 2,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తుషార్‌ దూడి తెలిపారు.

పల్నాడు జిల్లా కౌంటింగ్ నరసరావుపేటలోని జేఎన్టీయూ కళాశాలలో, , బాపట్ల జిల్లా కౌంటింగ్‌కు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.. ప్రతి జిల్లాలో 2000 మందికి తగ్గకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.. గుంటూరు జిల్లాలో 2500 మంది పోలీసులతో పోలీస్ పహార ఏర్పాటు చేయగా.. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 3000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి అసెంబ్లీ స్థానానికి 14 టేబుళ్లతో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.

తిరుపతి జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 16 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

ఓట్ల లెక్కింపు రోజున ఏజంట్లు ఉదయం 7 గంటల్లోపే కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని .అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 315 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ గౌతమి సాలి చెప్పారు.

మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ వెల్లడించారు.. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశాం.. ప్రతి నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 15,39,460 ఓటర్లు ఉండగా.. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి, 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 12,93,948 ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు.

శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే క‌ఠిన చ‌ర్య‌లు .. కౌంటింగ్ కు అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని నిర్థాక్షణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నిజిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కౌంటింగ్ రోజు, తరువాత రోజుల్లో శాంతి భద్రతలు అదుపులో ఉండేలా, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతవాతావరణంలో పూర్తయ్యేలా ముందస్తు జాగ్రత్తలుపై అధికారుల దృష్టి కేంద్రీకరించారు.

ఎన్నిక‌ల బ‌రిలో ముఖ్య‌మంత్రి, ఇద్ద‌రు మాజీ ముఖ్య‌మంత్రులు

ఏపీలో ఏక‌కాలంలో ఇటు లోక్ స‌భ‌కు, అటు అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ఒక ముఖ్య‌మంత్రితో పాటు ఇద్దరు మాజీ ముఖ్య‌మంత్రులు, 11 మంది మంత్రులు, 28మందికి పైగా మాజీ మంత్రులు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు.. ఇక పులివెందుల అసెంబ్లీ బ‌రిలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ , కుప్పం నుంచి మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, పిఠాపురం నుంచి ప‌వ‌న్ కల్యాణ్ ను బరిలో ఉన్నారు.. లోక్ స‌భ విష‌యానికొస్తే రాజంపేట నుంచి ఉమ్మ‌డి ఎపి మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి బిజెపి అభ్య‌ర్ధిగా పోటీ చేశారు.. బిజెపి రాష్ట్ర చీఫ్ పురందేశ్వ‌రి, ఎపి పిసిపి బాస్ ష‌ర్మిల క‌డ‌ప నుంచి అదృష్టాన్ని ప‌రిక్షించుకుంటున్నారు. అన‌కాప‌ల్లిలో సిఎం ర‌మేష్ బిజెపి అభ్య‌ర్ధిగా రంగంలో ఉన్నారు.విజ‌య‌వాడ వెస్ట్ల్ సిఎం ర‌మేష్, న‌గ‌రిలో రోజా, పుంగ‌నూరులో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి , చీపురుప‌ల్లిలో మంత్రి బోత్స‌, ఉండి ర‌ఘ‌రామ‌కృష్ణం రాజు, మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ , న‌గ‌రిలో రోజా త‌దిత‌రులు పోటీలో ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement