Thursday, November 7, 2024

Andhra Pradesh – పించ‌న్ ల కోసం రూ.4,400 కోట్లు విడుదల…..

జులై 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సిద్ధం అవుతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. గత మూడు నెలల ముందే నుంచే పెంచిన పెన్షన్‌తో పాటు జులై నెల పెన్షన్‌ కూడా కలిపి ఒకేసారి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.. దీని కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లతో ఈ రోజు వీడియో కార్ఫరెన్స్‌ నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌.. పెన్షన్ల పంపిణీ నిమిత్తం రూ. 4,400 కోట్ల విడుదల చేసినట్టు వెల్లడించారు..

జులై 1వ తేదీన 65.18 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ఫించన్లు పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు.. ఫించన్ల పంపిణీకి ఇతర ఫంక్షనరీల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.. జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు.. పెన్షన్ల పంపిణీపై గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశించారు.

- Advertisement -

సోమవారం ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జులై 1వ తేదీన 90 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన డబ్బులను ఇవాళ రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని సూచించారు సీఎస్.

Advertisement

తాజా వార్తలు

Advertisement