ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్‌లు రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అభ్యర్థన మేరకు స్పందించిన కేంద్రం ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీకి 144 మంది ఐపీఎస్‌లు ఉండగా.. వారిని 174కు పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర డిప్యుటేషన్ రిజర్వ్‌గా 38 మంది ఐపీఎస్‌లను కేటాయించింది. రాష్ట్రాలకు డిప్యుటేషన్ రిజర్వ్‌గా 23 మందిని కేటాయించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 144 మంది ఐపీఎస్‌లను కేటాయించారు. కానీ అది రాష్ట్రానికి సరిపోలేదు. పైగా జగన్ సీఎంగా ఉన్న టైమ్‌లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. దీంతోపాటు నిఘా వ్యవస్థ విభాగాల్లో, క్రైమ్ విభాగాల్లో పోలీసు అధికారుల కొరత తీవ్రంగా మారింది. దీంతో తమకు మరింత మంది ఐపీఎస్‌లను కేటాయించాలని జగన్ అప్పట్లో కేంద్రానికి లేఖ కూడా రాశారు. కానీ ఫలితం లేకపోయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement