Friday, November 22, 2024

Andhra Pradesh – 8 మంది ఐపీఎస్, 21 మంది అదనపు ఎస్పీలు, 112 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

అమరావతి – పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది.ఇటీవల భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఈసీ ఆదేశాల మేరకు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. 112 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

8 మంది ఐపీఎస్ లకు స్థాన చలనం

ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు, బదిలీలు, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది…లా అండ్ ఆర్డర్ ఏడీజీ శంకభ్రత బాగ్చీకి హోం గార్డ్స్ ఏడీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ రాజశేఖర్ బాబుకు కోస్టల్ సెక్యూర్టీ ఐజీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా కృష్ణ కాంత్‌కు బాధ్యతలు అప్పగించారు.

సీఐడీ ఎస్పీగా గంగాధర్ రావు, కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్‌కు కాకినాడ బెటాలియన్ కమాండెంటుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంటుగా రత్న, అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంటుగా అమిత్ బర్దార్, ఇంటెలిజెన్స్ విభాగానికి ఆనంద రెడ్డి బదిలీ అయ్యారు.

- Advertisement -

21 మంది అదనపు ఎస్పీలు బదిలీ

రాష్ట్రవ్యాప్తంగా 21 మంది అదనపు ఎస్పీ అధికారులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఇటీవల ఏపి లో రోజుల వ్యవధిలోనే 21 మంది ఐఏఎస్‌లు, 30 మంది ఐపీఎస్‌లు బదిలీ అయిన సంగతి తెలిసిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement