Friday, September 20, 2024

Andhra Pradesh – శ్రీసిటీలో చంద్ర‌బాబు బిజిబిజీ… 15 కంపెనీలు ప్రారంభించిన చంద్ర‌బాబు

ఏక‌కాలంలో 15 కంపెనీలు ప్రారంభించిన చంద్ర‌బాబు
మ‌రో ఏడు సంస్థ‌ల‌కు శంకుస్థాప‌న‌లు
రూ.900 కోట్ల పెట్టుబ‌డులు
సుమారు మూడు వేల మందికి ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – శ్రీసిటీ – ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా శ్రీసిటీలో నేడు పర్యటించారు. పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. . ఇక్కడ మొత్తం 15 సంస్థల కార్యకలాపాలను ఆయన ప్రారంభించిన ఆయ‌న మరో ఏడు సంస్థ‌ల కార్యాల‌యాల‌కు శంకుస్థాప‌న చేశారు.

- Advertisement -

దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జికెమ్‌, ఇజ్రాయిల్‌కు చెందిన నియోలింక్‌, జపాన్‌కు చెందిన నైడిక్‌, ఓజెఐ ఇండియా ప్యాకేజ్‌, జర్మనీకి చెందిన బెల్‌ పరిశ్రమలతో పాటు భారతదేశానికి చెందిన అడ్మైర్‌, ఆటోడేటా, బాంబేకోటెడ్‌ స్పెషల్‌ స్టీల్స్‌, ఈప్యాక్‌, ఇఎస్‌ఎస్‌కెఏవై, ఎవర్‌షైన్‌, జేజీఐ, త్రినాత్, జెన్‌లెనిన్‌ సంస్థల కార్యాకలాపాల‌కు చంద్ర‌బాబు నేడు శ్రీకారం చుట్టారు.. రూ. 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటైన ఈ సంస్థల ద్వారా 2 వేల 740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ల‌భించాయ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టివంచారు.

ఇక చైనాకు చెందిన ఎన్‌జీసీ, బెల్జియంకు చెందిన వెర్మేరియన్‌, జపాన్‌కు చెందిన ఏజీ ఆండ్‌ పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఇదే సంద‌ర్భంగా జపాన్‌కు చెందిన రెండు పరిశ్రమలు, యూఏఇ, సింగపూర్‌లతో పాటు భారతదేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకున్నారు. వాటి పెట్టుబ‌డుల‌ విలువ 1,213కోట్ల రూపాయలుగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

అనంతరం శ్రీసిటీలోని బిజినెస్‌ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో జరిగిన సమావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల‌ను వివ‌రించారు.. ఎపి పారిశ్రామిక విధానాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు ఎపి సిఎం .

Advertisement

తాజా వార్తలు

Advertisement