2025 వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్.
విశాఖపట్నం, డిసెంబర్ 20 : భారత స్వాతంత్ర పోరాటంలో సైతం ఆంధ్రప్రభ దినపత్రిక తనదైన పాత్ర పోషించిందని రాష్ట్ర పర్యాటక భాషా సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. శుక్రవారం పౌర గ్రంధాలయంలో ఆంధ్రప్రభ జాతీయ దినపత్రిక 2025 వార్షిక క్యాలెండర్ ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ… లక్షలాది మంది పాఠకుల నుంచి విశేష ఆదరణ పొందడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా ఆంధ్రప్రభ ముందు వరుసలో ఉందన్నారు. అందువల్లే ఆంధ్రప్రభ పాఠకుల మదిలో సుస్థిర స్థానం పొందిందన్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ముత్తా గౌతమ్ కు, సంపాదకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో చీఫ్ గంట్ల శ్రీనుబాబు, అకౌంట్స్ విభాగం ఇంచార్జ్ అక్కినేని ఉదయ్ కుమార్ గోపినాథ్, పిల్లా నగేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రముఖులు పేరి రవికుమార్, బేతవోలు రాంబ్రహ్మం, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, కనక మహాలక్ష్మి, రాజ మన్నారు, తదితర ప్రముఖులు అంతా పాల్గొన్నారు.