తుఫాను కారణంగా చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సూచించారు. శనివారం రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధానంగా విద్యుత్, నీటిపారుదల, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖలతో పాటు ఇతర అన్నీ శాఖల అధికారులు సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అరణియార్ నుండి గేట్లు ద్వారా అధిక నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో అరుణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధికారులు రాత్రివేళల్లో సైతం గ్రామాల్లోని బస చేసి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. తమ గ్రామాలకు వచ్చే అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గ్రామ వాలంటీర్లు కీలక పాత్ర పోషించి ఎప్పటికపుడు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చెరవేయాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement