Thursday, November 21, 2024

Andhra Prabha – చీరాల, వేటపాలెం బీచ్​లలో నో ఎంట్రీ …


ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: గడచిన పది రోజుల్లో వరుసగా జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది యువకులు మృతి చెందటంతో పోలీసుల్లో అలజడి రేగింది. బీచ్ లకు వచ్చే యువకులను ప్రమాదాల బారిన పడకుండా నియంత్రించటం కష్టమని భావించి.. కడకు బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం మండల్లాలోని బీచ్‌లను పోలీసులు సోమవారం నుంచి మూసి వేశారు. సముద్రాన్నికి వెళ్ళే మార్గాలలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. గత పది రోజుల కాలంలో రామాపురం, వాడరేవు తీరాల్లో తొమ్మిది మంది యువకులు మృతి చెందారు. వరుస మరణాల నేపథ్యంలో పర్యాటకులు వచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

- Advertisement -

ఆదివారం స్నేహితులతో కలిసి సరదాగా సముద్రతీరంలో గడిపేందుకు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరానికి వచ్చిన ఇద్దరు యువకులు మృతి చెందారు.గుంటూరు జిల్లా మంగళగిరిలోని భార్గవపేటకు చెందిన పది మంది యువకులు బీచ్‌కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. తోటి స్నేహితులు గాలించి వారిద్దరినీ బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. ఇలా కేవలం పది రోజుల వ్యవధిలోనే విహారానికి వచ్చిన యువకులు మృతి చెందటంతో పదే పదే విషాద ఘటనలు చోటు చేసుకొంటున్న తరుణంలో బాపట్ల జిల్ఆ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ బీచ్ ల్లో స్నానాలను నిషేధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement