ఆంధ్రప్రభ స్మార్ట్ – విశాఖపట్నం :ఆంధ్ర హాస్పిటల్స్ విశాఖపట్నం , హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె చారిటీ కలిసి ఉచిత పిల్లల గుండె ఆపరేషన్లు రేపటి నుంచి 7 వరకు చేయనున్నారు. డాక్టర్ రేవంత్, కార్డియాక్ సర్జన్, డాక్టర్ విక్రమ్ పిల్లల కార్డియాలిజిస్టు ఆధ్వర్యంలో ఆంధ్ర హాస్పిటల్స్ కార్డియాక్ టీమ్, ఇంగ్లాండ్ నుండి వచ్చిన డాక్టర్స్ టీంతో కలిసి ఈ క్యాంపును చేయనున్నారు
.ఈ క్యాంపులో క్లిష్టమైన పిల్లల గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఇప్పటి వరకు 30 క్యాంపులు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో విజయవంతంగా చేశారు. 4000 గుండె ఆపరేషన్లు , ఇంటర్వెన్షన్స్ చేసిన అనుభవంతో మొదటిసారిగా ఇప్పుడు విశాఖపట్నంలో చేస్తున్నారు.
పిల్లలకి గుండె జబ్బులు ఉన్న తల్లిదండ్రులు, పిల్లల డాకర్లు దగ్గర ఉన్న గుండె జబ్బులున్న పిల్లలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఇతర సమాచారం కోసం ఈ 8886679733 /08912724777 నంబర్స్ కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని , చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ , డైరెక్టర్, పి. వి. రామారావు తెలియచేశారు.