Friday, November 22, 2024

చలో విజయవాడకు అడ్డగింపులు.. పోలీసుల అదుపులో ఉద్యోగులు

పిఆర్‌సి జిఒలను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఫిబ్రవరి 3న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం భగ్నం చేసేందుకు ప్రయత్నాలు  ప్రారంభించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఇళ్ళ ముందు పోలీసులు పహారా కాస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతల ఇళ్ళ ముందు పోలీసులను మోహరించారు. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు నీడలా వెంటాడుతున్నారు. కొంతమందికి నోటీసులు ఇచ్చారు. యుటిఎఫ్‌, ఎస్టీయు, ఎపి జెఎసి నాయకుల ఇళ్ళ ముందు పోలీసులు పహారా కాస్తున్నారు.

ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఏపీ ఉద్యోగ జెఎసి, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షులు వెంగళరెడ్డి ని అదుపులోకి తీసుకొని ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో తరలించగా, ఫ్యాప్టో నేత ప్రకాష్ రావ్ ను కర్నూల్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. వారితో పాటు జిల్లాలో పలువురు ఉద్యోగ సంఘం నేతలను వారి ఇళ్లలోనే నిర్బంధించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement