అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రా అరటి అంతర్జాతీయ ఖ్యాతి నార్జిస్తోంది. వివిధ దేశాలకు పెరుగుతున్న ఎగుమతులు, నాణ్యత, దిగుబడి, పరిశోధనా రంగాల్లో అంతర్జాతీయ సంస్థలతో కుదురుతున్న ఒప్పందాల దృష్ట్యా ఆంధ్రా అరటి పంటకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) సంకల్పించింది. అరటిసాగు అధికంగా చేపట్టే అనంతపురం జిల్లాను బనానా డెవలప్‌మెంట్ క్లస్టర్‌గా ప్రకటించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్ల్రో ఉద్యానపంటలకు సంబంధించి ప్రకటించిన ఏడు డెవలప్ మెంట్ క్లస్టర్లలో అనంతపురం అరటి కూడా స్థానం సంపాదించింది. బనానా డెవలప్ మెంట్ క్లస్లర్ గా అనంతపురంతో పాటు- తమిళనాడులోని థేనీ జిల్లాను కూడా ఎన్‌హెచ్‌బీ ఎంపిక చేసింది. ద్రాక్ష క్లస్టర్‌గా నాసిక్ (మహారా), ఫైనాపిల్ క్లస్టర్‌గా సిఫాహిజలా (త్రిపు), దానిమ్మ క్లస్టర్లుగా షోలాపూర్ (మహారా), చిత్రదుర్గ (కర్ణాట), యాపిల్ క్లస్టర్లుగా షోపియాన్ (జమ్మూకాశ్మీర్), కిన్నౌర్ (హిమాచలప్రదేశ్), మామిడి క్లస్టర్లుగా లక్నో (ఉత్తరప్రదేశ్), కచ్ (గుజరాత్), మహబూబ్‌నగర్ జిల్లా (తెలంగాణా)లు ఎంపికయ్యాయి.
రూ. 270 కోట్ల నిధులు
బనానా క్లస్టర్ గా ఎంపి-కై-న అనంతపురం అరటి సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 270 కోట్లను విడుదల చేయనుంది. మౌలిక వసతులు, పరిశోధన, దిగుబడి పెంపు, నాణ్యమైన ఉత్పత్తి, రైతులకు శిక్షణతో పాటు- అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటు-లోకి తీసుకొచ్చేందుకు క్లస్టర్ నిధులను వ్యయం చేయనున్నట్టు- అధికారవర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మార్కెటింగ్, బ్రాండింగ్, రవాణా వసతుల కోసం రూ.78.70 కోట్లు-, నాణ్యమైన ఉత్పత్తి కోసం రూ. 116.5 కోట్లు-, వ్యాల్యూ యాడెడ్ (విలువ ఆధారి) ఉత్పత్తుల కోసం రూ 74.75 కోట్లు- వ్యయం చేసేందుకు ఎన్‌హెచ్‌బీ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌బీ అధికారుల బృందం అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సాగవుతున్న అరటి తోటలను ఇప్పటికే పరిశీలించింది. అనంతపురం జిల్లాలో అరటి సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు, రైతులు అనుసరిస్తున్న సాగు యాజమాన్య పద్ధతులు, దిగుబడి తదితర విషయాలపై అధ్యయనం చేసిన ఎన్‌హెచ్‌బీ అధికారులు ఈనెల మూడోవారంలో మరోసారి పర్యటించనున్నట్టు- సమాచారం.
కెనడాతో వాణిజ్య ఒప్పందం
అనంతపురం జిల్లాను బనానా క్లస్లర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో అరటి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కెనడాతో కీలక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. కెనడాకు ఎగుమతయ్యే అరటిలో ప్రధాన వాటా ఏపీ, ఆ తరువాత తమిళనాడుదని అధికారవర్గాల సమాచారం. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహూజా, కెనడా హైకమిషనర్ కెమరాన్ మెక్‌కేల మధ్య ఇటీ-వలనే రాతపూర్వక ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. ఏపీ నుంచి 2020-21లో 42,935 మెట్రిక్ టన్నుల అరటి పళ్లు ఎగుమతి అయినట్టు- ఇటీ-వల అగ్రికల్చరల్, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్టస్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ- (అపెడా) ప్రకటింగా తాజా ఒప్పందంతో ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. కెనడాతో ఒప్పందంతో అరటికి మంచి రోజులు వచ్చినట్టేననీ, రైతులు అధిక లాభాలు చవిచూడటం తధ్యమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.