Saturday, November 23, 2024

Ananthpuram జాయింట్ కలెక్ట‌ర్ హ‌రిత‌కు షాక్

నియ‌మాకాన్ని ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం
అనం ట్విట్ తో నిర్ణ‌యం
జిఎడిలో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశం

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : నెల్లూరు జిల్లా కు చెందిన తెలుగుదేశం నాయకుడు ఎక్స్ (ట్విటర్ ) లో చేసిన ఆరోపణల ఫలితంగా గత వారం అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమితులైన హరిత నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసిన అరుదైన విశేషం ఇది. రెండునెలల క్రితం అధికారం లో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల పరంపర లో భాగంగా గత వారం పలువురు ఐ ఏ ఎస్ అధికారుల బదిలీ అయ్యారు. అందులో భాగంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐ ఏ ఎస్ అధికారి డి. హరిత ను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకుడు అనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతా లో హరిత నియామకం పై ఒక పోస్ట్ పెట్టారు. అందులో హరిత ను అవినీతి అధికారిగా పేర్కొంటూ తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసినప్పుడు టీ డి ఆర్ బాండ్ల స్కామ్ కు ఆమె పాల్పడినట్టు పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన ప్రభుత్వం లోని పెద్దల దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఈరోజు అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా హరిత నియామక ఉత్తర్వులను రద్దు చేసి, ఆమెను జి ఏ డి లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

గత ప్రభుత్వ హయాంలో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా పనిచేసిన నియమితులైన హరిత ఐ ఏ ఎస్ హోదా పొంది ముందు శ్రీకాళహస్తి ఆర్ డి ఓ గా, తరువాత నెల్లూరు మునిసిపల్ కమిషనర్ గా పనిచేసి ఆపై తిరుపతి మునిసిపల్ కమిషనర్ గా కూడా పనిచేశారు. గత ఏడాది ఉత్తరాంధ్ర కు బదిలీ అయిన ఆమె సెలవులో వెళ్లి గత కొంత కాలంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో నకిలీ ఓట్ల వివాదం, తిరుపతి స్మార్ట్ సిటీ పనుల్లో, టీ డి ఆర్ బాండ్ల వ్యవహారం లలో చోటు చేసుకుంటున్న అవినీతి ఆరోపణలల్లో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం గమనార్హం. తాజాగా అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమితులైన వారం రోజుల్లో అవే ఆరోపణల నేపథ్యంలో ఆ నియామకంరద్దు కావడం సంచలన చర్చ నీయాంశమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement