Friday, November 22, 2024

కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దుచేయాలి- తెలుగు నాడు విద్యార్థి ఫెడరేషన్

ధర్మవరం అర్బన్ – కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ హిందూపూర్ డివిజన్ అధ్యక్షులు కురుబ జగదీష్ డిమాండ్ చేశారు . బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు . అలాగే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఇస్తున్న విశాఖఉక్కు ప్రైవేటీకరణను విరమించుకోవాలి అన్న నినాదంతో మార్చి 26న అఖిలపక్ష భారత్ బంద్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతిస్తున్న తరుణంలో రేపటి రోజున పార్లమెంట్ వ్యాప్తంగా బంద్ ను జయప్రదం చేయాలని తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు కురుబ జగదీష్ పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ దేశానికి చాలా నష్టం అని తప్పకుండా బంద్ పాటించి రైతులకు అదేవిధంగా విశాఖ కార్మికులకు మద్దతు తెలపాలని తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ నాయుడు, విజయ్ చౌదరి, బాబుఖాన్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement