Friday, October 18, 2024

హిందూపురంలో ఆక్సిజ‌న్ అంద‌క 8 మంది కరోనా పేషేంట్స్ మృతి

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగులకు ఆక్సిజన్ అందక 8 మంది మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. ఈ విషయం తెలుసుకున్న మృతుల బంధువులు నాదాలతో ఆసుపత్రిలో కి చేరుకొని వైద్యుల నిర్లక్ష్యం కారణం వల్లనే మృతి చెందారు అంటూ ఆసుపత్రిలో అద్దాలను పగులగొట్టి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల వైద్య అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని సంఘటనకు ప్రత్యేక నిదర్శనం ఈ రోజు జరిగిన సంఘటన మృతుల బంధువులు ఆర్తనాదాలతో ఆస్పత్రి వద్ద అ వైద్య అధికారులకు ప్రభుత్వం కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులో కరోనా రోగుల చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో సరైన వైద్యం అందించడం లేదని రోగులు తమ బంధువులకు తెలిపిన ఈ విషయంపై వెంటనే ఆసుపత్రి సిబ్బందికి తెలియజేసిన సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదం సంభవించి 8మంది రోగులు మృతి చెందారని ఆరోపించి రోగుల బంధువులు ఆందోళనకు దిగారు.
ఈ ఘటనపై శాఖాపరమైన చర్యలు చేపట్టి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది సంఖ్య పెంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న ఒకటో పట్టణ సీఐ బాల మద్దిలేటి ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు హుటాహుటిన ఆక్సిజన్ ట్యాంక్ ను నుండి ఆక్సిజన్ను వదలడంతో పెను ప్రమాదం తప్పిందని ఆందోళనకారులు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement