Tuesday, November 26, 2024

అమడగూరులో మొబైల్ ,బ్లూటూత్ ద్వారా పరీక్షలు.. ప్రిన్సిపాల్ దందా..

అనంతపురం ప్రభన్యూస్ : అమడగూరు మండల పరిధిలోని శీతిరెడ్డిపల్లి సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో భారీగా మాస్ కాఫీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓబులదేవరచెరువు శ్రీవీరబ్రహ్మం జూనియర్ కళాశాల,విజ్ఞాన్ జూనియర్ కళాశాల,శ్రీవిజ్ఞాన్ బాలికల కళాశాల విద్యార్థులకు కూడా అమడగూరు జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం కావడంతో విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు. అయితే అమడగూరు కళాశాల ప్రిన్సిపాల్ పబ్లిక్ పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో అమడగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవేటు కళాశాలల యాజమాన్యంతో కుమ్మక్కై మాస్ కాఫీయింగ్ చేస్తూ ఆ విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడానికి దాసోహమయ్యాడని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చీఫ్ సూపరింటెండెంట్ ప్రవేటు కళాశాలల యాజమాన్యంతో లక్షలాది రూపాయలకు ఒప్పందం కుదూర్చుకొని విద్యార్థులకు మైక్రో జీరాక్స్ కాఫీలు అందజేస్తూ మాస్ కాపీయింగ్ కు ప్రొత్సాహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మైక్రో జీరాక్స్ కాఫీలను కేవలం ప్రవేటు కళాశాలల విద్యార్థులకు మాత్రమే అందజేసి వారి ఉత్తీర్ణత శాతం పెరుగుదలకు కృషి చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా వ్యవహరిస్తున్నారన్నారు.గత ఇరవై రోజుల క్రితమే ఓబులదేవరచెరువులో బారీగా మైక్రో జీరాక్స్ పుస్తకాలను కోనుగోలు చేయడం విశేషం.అంతేకాక ప్రవేటు కళాశాల విద్యార్థులు సిట్టింగ్ అరెంజ్ మెంట్ కూడా దగ్గర దగ్గరగా కుర్చోబెట్టి మాస్ కాఫీయింగ్ చేయిస్తున్నట్లు అరోపిస్తున్నారు.

ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు సొంత కాలేజ్ లు వున్న కళాశాలలకు పరీక్ష కేంద్రాలుగా నియమించకూడదని ఆదేశాలు రావడంతో మాస్ కాపీయింగ్ ను అరికట్టడానికి అమడగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరీక్ష కేంద్రంగా నియమిస్తే ఇక్కడ చీఫ్ సూపరింటెండెంట్ అధికారితో ప్రవేట్ కళాశాలల యాజమాన్యం ఒప్పందం కుదూర్చుకోని మాముళ్లు తీసుకొని ప్రభుత్వ కళాశాల అభివృద్ధిని మరిచి ప్రవేటు కళాశాలల అభివృద్ధికి కంకనం కట్టుకున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లక్షలాది రూపాయలు జీతం ప్రభుత్వం నుండి తీసుకుంటున్న కూడా అడ్డగోలు వ్యవహరం పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా మాట్లాడితే నాకు ఆర్ఐఓ తెలుసు వాళ్లు వీళ్లు తెలుసని బెదిరింపులకు దిగినట్లు సమాచారం. పరీక్షల గదులలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ లైవ్ కనేక్షన్ విజయవాడ ఇంటర్ బోర్డుకి ఇవ్వకుండా నిర్వహిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాక ప్రవేట్ కళాశాలల యాజమాన్యం కూడా విద్యార్థులు అందరినీ వందశాతం ఉత్తీర్ణత సాధించేలా మేము చూసుకుంటామని ఒక్కొక్క విద్యార్థి దగ్గర రెండు వేల రూపాయలు నుండి మూడు వేల రూపాయలు వరకు మైంటేనేన్స్ పీజులు కింద వసూళ్లు చేసినట్లు విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రాక్టికల్ పరీక్షలకు,అమడగూరు పరీక్ష కేంద్రం కావడంతో ప్రవేటు కళాశాల యాజమాన్యంతో కుమ్మక్కై ప్రవేటు కళాశాలల విద్యార్థులకు వంద శాతం మార్కులు వేసి ప్రవేటు కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నరని స్థానికులు మాట్లాడుకోవడం చర్చనీయాంశం. అలాగే హాల్ టికెట్లకు, రికార్డులకు, అటేనేన్స్ పీజులు కింద విద్యార్థులు నుండి వేలాది రూపాయలు వసూళ్లు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. గత 15 సంవత్సరాలగా అమడగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉత్తీర్ణతకు మారుపేరు కావడంతో జిల్లాలోనే మంచి గుర్తింపు పొందడంతో ఓబులదేవరచెరువు, నల్లమాడ, గోరంట్ల, తనకల్లు, మండలాలు నుండి దాదాపు 500 మంది విద్యార్థులు వచ్చి ఈ కళాశాలలో చదువుకునేవారు. అయితే ప్రస్తుతం కళాశాల ఉత్తీర్ణత శాతం తగ్గడంతోపాటు ప్రస్తుత ప్రిన్సిపాల్ ,భాద్యతలు చేపట్టినప్పటి నుండి కళాశాల ఉత్తీర్ణత శాతం కూడా తగ్గిపోయింది. అంతేకాక ఇక్కడ అధ్యాపకులు ప్రవర్తన కూడా నచ్చకపోవడంతో ప్రవేటు కళాశాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రిన్సిపాల్ కొంతమంది అధ్యాపకులు ప్రవేటు కళాశాలల యాజమాన్యం ఇచ్చే కమీషన్లుకు అశపడి ఈ కళాశాలలో సరైన వసతులు లేవు ప్రవేటు కళాశాలలో చేరండని చెప్పి పంపించేస్తున్నారని మండల వ్యాప్తంగా విమర్శలు చేస్తున్నారు.
మరో కొత్త వ్యాపారం ప్రారంబించిన ప్రిన్సిపాల్

ప్రవేటు ఇంజనీరింగ్ మెడిసిన్ కళాశాలలతో కుమ్మక్కు..

అమడగూరు కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులు కళాశాల విధులకు సక్రమంగా రాకుండా మరో వ్యాపారం చేసుకుంటూ 11 గంటల పైన విధులకు వచ్చి వెల్లుపోతున్నట్లు ఆరోపణలు జోరందుకున్నాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులను ప్రవేటు ఇంజనీరింగ్, మెడిసిన్ పేరుతో ప్రవేటు కళాశాల యాజమాన్యంతో కుమ్మక్కై విజయవాడ, తాడిపత్రి, అనంతపురం, తిరుపతి, మదనపల్లి పట్టణాలలోని ప్రవేటు కళాశాలలో విద్యార్థులు చేర్పించి ఒక్కోక్క అడ్మిషన్ కు 30 వేల రూపాయలు నుండి 40 వేలు రూపాయలు దాక కమీషన్లు తీసుకుంటూ దనార్జనే ద్యేయంగా జేబులు నింపుకుంటున్నారు. ఇలా వీరి మాటలు నమ్మి వెల్లిన విద్యార్థులు ఆ కళాశాలలో సర్టిఫికేట్ లు ఇచ్చి అక్కడ వసతులు బాగలేకనో, అనారోగ్యంతోనో వచ్చేస్తే అలాంటి విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వకుండా విద్యార్థులు జీవితాలతో చెలగాటం అడుకుంటున్నారని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు.

సెల్ పోన్లు, బ్లూటూత్ లు తీసుకెళ్లి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు..

- Advertisement -

పరీక్ష కేంద్రంలో ప్రవేటు కళాశాలల విద్యార్థులు సెల్ పోన్ లు, మైక్రో బ్లూటూత్, మైక్రో జీరాక్స్ కాఫీలు తీసుకెళ్లి పరీక్ష రాస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గురువారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథమ్యాటిక్స్-ఎ పరీక్ష జరగగా రూమ్ నంబర్ 4 లో ఒక విద్యార్థిని మొబైల్ పోన్ తీసుకెళ్లి దాదాపు గంటన్నర సేపు పైన మొబైల్ లో చూసుకోని పరీక్ష రాసింది. ఇది గమనించిన ఇన్వీజీలేటర్ అమ్మాయి దగ్గర మొబైల్ లాక్కోని చీప్ కి తెలియజేశారు. అయితే సదరు చీప్ ఆఫీసర్ అమ్మాయి పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మొబైల్ తీసుకొని అమ్మాయిని అలాగే పరీక్ష రాయించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా తెలుగు, ఇంగ్లీషు పరీక్షల రోజు కూడా బ్లూటూత్ లు, మొబైల్, మాస్ కాఫీయింగ్ స్లీప్ లు తీసుకెళ్లిన విద్యార్థులను డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ హమీద్ కు పట్టుపడగా డీభార్ చేయాలని చెప్పడంతో చీఫ్ ఆఫీసర్ డీబార్ చేయకూడదని అతనిపై గొడవపడ్డారని విశ్వసనీయశమాచారం. డీఓ గా హమీద్ వుంటే పరీక్షలు పకడ్బందీగా జరుగుతే తనకు ప్రవేటు కళాశాలల నుండి ఇబ్బందులు వస్తాయని ఆర్ ఐఓ కు హమీద్ ను తొలగించాలని చెప్పి గురువారం జరిగిన మ్యాథమ్యాటిక్స్ ఎ పరీక్షకు కొత్త డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ ని నియమించుకున్నారు. ప్రభాకర్ పై గతంలో కూడా అవినీతి ఆరోపణలు జరిగినట్లు వున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చీఫ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ పైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement