కొత్తచెరువు. తెలుగుదేశం పార్టీని పేదల కోసం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ అని మండల టౌన్ కన్వీనర్లు అడపాల రామకృష్ణ,వలిపి శ్రీనివాసులు పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద మండలంలోని టిడిపి నాయకులు,కార్యకర్తలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు తెలుగుదేశం పార్టీని మహనీయుడు కలియుగ పురుషుడు నందమూరి తారక రామారావు 1983 తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదలకు కూడు,గూడు,గుడ్డ అన్న నినాదంతో అనతికాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన మహనీయుడన్నారు.ఎస్సీ ఎస్టీ,బీసీ,మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారన్నారు.ఎన్టీఆర్ మరణానంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించి రాష్ట్రన్ని ఐటి పరంగా అభివృద్ధి పరిచారన్నారు.రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా చేసుకొని రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు సాలక్కగారి వేకటరమనప్ప,మాణిక్యం బాబా, శ్రీనివాసులు,గాజుల చంద్ర,పివి.శివ ప్రసాద్, ఎంపీటీసీ అభ్యర్థులు నాగేంద్ర ప్రసాద్ ఇమామ్,టైలర్ కొండ,బండపల్లి రాజు,సైకిల్ షాప్ బాబా,వడ్డే శంకర,విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ…పేదలకోసం పుట్టిన పార్టీ
Advertisement
తాజా వార్తలు
Advertisement