పరిగి, – బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కొరకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందిస్తున్నా ఏకైక ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు ఆయన శుక్రవారం పరిగి మండలం లో పర్యటించారు అందులో భాగంగా తొలుత ఊటుకూరు చెరువులో గంగ పూజలు నిర్వహించి కృష్ణా జలాలకు జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఊటుకూరు గ్రామం లో ఏర్పాటుచేసిన సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజల అత్యున్నత కి కట్టుబడి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఎన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వం నిర్వహిస్తుందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు గతంలో 80 శాతానికి పైగా పేద ప్రజలు ప్రభుత్వ పథకాలను పొందుతున్నారని ప్రతి ఒక్కరిలోనూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు ఎన్నికల్లో గెలవలేక ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై అనవసరం ఆరోపణలు చేయడమే తప్ప నిజమేనా ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని కూడా చాటుకో లేని పరిస్థితుల్లో టీడీపీ ఉందని ప్రస్తుతం జరుగబోవు మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఎన్నికలను ఎదుర్కోవడానికి తెలుగుదేశం కుంటి సాకులు చెబుతుందని తెలిపారు వచ్చే ఏడాదికి మండలంలోని అన్ని చెరువులను కృష్ణా జలాలతో పంపుతామన్నారు ఈ ఏడాది పుష్కలంగా కృష్ణా జలాలు అందుబాటులోకి రావడంతో జిల్లాలో అనేక చెరువులు నింపడం జరిగింది వచ్చే ఏడాది కాలువ వెడల్పు చేసి త్వరితగతిన చెరువులో ఉండే విధంగా కార్యక్రమం రూపొందించామన్నారు. ఊటుకూరు చెరువు కృష్ణ జలాలతో కళకళలాడుతుండడంతొ గ్రామస్తులు మంత్రికి ధన్య వాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసారు. అనంతరం శాసన కోట గ్రామాలలో ఏర్పాటుచేసిన గ్రామ పంచాయితీ సర్పంచులు వార్డ్ మెంబర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమాల్లో మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అదే వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ ఎంతో సుఖసంతోషాలతో జీవిస్తున్నారని పేర్కొన్నారు, ప్రజా అభివృద్ధి ప్రజా సంక్షేమమే దెయ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి అడుగులు వేస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ అభివృద్ధికి పాటుపడాలి అన్నారు, హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు చెరువులోకి రావడంతో తాగునీటికి సాగునీటికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు, ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్ గా ఎన్నికైన వారిచే ప్రమాణ స్వీకారోత్సవం గావించి ఆశీర్వదించారు, అంతేకాకుండా జరగబోయే ఎంపీటీసీ,జడ్పిటిసి,అభ్యర్థుల సమావేశం ఏర్పాటు చేసి జెడ్ పి టీసి, యంపి టీ సి ఎన్నికల్లో గెలుపుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు రవీంద్ర, పరిగి మండల కన్వీనర్ జయరామ్, మార్కెట్ యార్డు డైరెక్టరు రమణ, ప్రభు,మారుటిరెడ్డీ, సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ ధ్యేయం -మంత్రి శంకర్ నారాయణ
Advertisement
తాజా వార్తలు
Advertisement