అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో రోడ్డుపై నడుచుకుంటు వెళుతున్న వ్యక్తి వద్ద ఉన్న నగదును దుండగులు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు రూ.1.80 లక్షలు దోచుకెళ్లారు. చీరల వ్యాపారి సిద్ధిక్ బస్సు దిగి డబ్బు సంచితో వెళ్తుండగా వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనంలో వచ్చిన దుండగులు డబ్బు సంచి లాక్కొని పరారయ్యారు. చోరీ జరిగిన ఘటన సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. బాధితుడు సిద్ధిక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement