Friday, November 22, 2024

మూడు నెల‌ల ప‌సికందుకు ఆరుదైన ఆప‌రేష‌న్

అనంతపురం సిటీ- మూడు నెలల పసిపాపకు అనంతపురం కిమ్స్‌ సవీరలో అత్యంత అరుదైన వెన్నుముక శచికిత్సను విజయవతంగా పూర్తి చేశారు కిమ్స్‌ వైద్యులు. ఏపీ – కర్నాటక సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన 3 నెలల పాప వింతైన వెన్నుముక వ్యాధితో బాధపడుతూ కిమ్స్‌ సవీర ఆసుపత్రిలో చేరారు. ఈ పాపను న్యూరో సర్జన్స్‌ డాక్టర్లు రామ మోహన్‌ నాయక్‌ మరియు రోహిత్‌ రెడ్డిలు పరీశీలించారు. వ్యాధి తీవ్రత మరింత ముదరక ముందే శచికిత్స చేయాలని, ఆపరేషన్‌ చేసే సమయంలో జరిగే ఇబ్బందులు కూడా ముందుగానే వివరించారు. వారు ఆంగీకరించిన తరువాత ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా శచికిత్సను పూర్తి చేసి పాపా ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రోహిత్‌ రెడ్డి మరియు డాక్టర్‌ రామ మోహన్‌ నాయక్‌ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో కొన్ని రకాల జన్యు పరమైన లోపాలతో వెన్నుపూసలో కణితులు తయారవుతుంటాయి. ఈ కణితులు నరాల్లో ఉండడం మూలంగా కణితుల వల్ల వచ్చే ఒత్తిడి మూలంగా చుట్టు- ప్రక్కల నరాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల కాళ్లు చచ్చుపడిపోవడం, మల మూత్ర విసర్జనలు అదుపు లేకపోవడం జరుగుతుంటాయని పేర్కొన్నారు. దీని మూలంగా పిల్లలు నరకయాతన అనుభవిస్తారని తెలిపారు. ఈ మూడు నెలల పాపా విషయంలో కూడా ఇలాంటి ఇబ్బంది రావడం వల్ల తామిద్దరం కలిసి విజయవంతంగా మెనింగో-మైలోసిస్‌ శచికిత్సను విజయవతంగా చేశామని తెలిపారు.
ఇప్పుడు పాప పూర్తిగా కొలుకొని సాధరణ జీవితంలోకి అడుగుపెట్టిందన్నారు. ఇలాంటి సర్జరీ చేయడం చాలా అరుదైనదన్నారు. అనంతరం కిమ్స్‌ సవీర ఎండీ కిషోర్‌ రెడ్డి, సీఇఓ ప్రసాద్‌లు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇలాంటి శచికిత్స కోసం అనంత ప్రజలు మెట్రోనగరాల వైపు అంటే బెంగళూరు, హైదరాబాద్‌ వంటి పెద్ద పెద్ద నగరాలకు వెళ్లే వారని అన్నారు. కానీ కిమ్స్‌ సవీరలో అత్యంత అనుభవం కలిగిన న్యూరో సర్జన్ల బృందం కలిగి ఉందన్నారు. డాక్టర్‌ రామ మోహన్‌ నాయక్‌ మరియు రోహిత్‌ రెడ్డిలు తమ ప్రతిభతో మూడు నెలల పాపాకు విజయంవంతంగా శచికిత్స గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. క్లిష్టమైన న్యూరో సంబంధిత సర్జరీలను ఇటీ-వల కాలంలో అధికంగా విజయ వంతంగా పూర్తి చేశామని తెలిపారు. తర్వాత పాప తల్లిదండ్రులు మాట్లాడుతూ అత్యం క్లిష్టమైన సర్జరీని ఆరోగ్య శ్రీ ద్వారా చేసి, మా పాప ప్రాణాలు కాపాడిన డాక్టర్లు కృతజ్ఞతలు కన్నీటి పర్యంతర మయ్యారు. డాక్టర్ల కృషి వల్లే తమ పాపను మళ్లీ ఈ స్థితిలో చూడాగలిగామని వారి అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement