ఒక రైలు తప్ప ఆగని వైనం
ఎంపీలు అనుకుంటే ఆ గుతాయా——?
48 వేల జనాభా ఉన్నా ఆగదే మి——?
ముదిగుబ్బ – దక్షిణ మధ్య రైల్వే లోని గుంతకల్లు డివిజన్ లోని ముదిగుబ్బ లో రైల్వే స్టేషన్ .జిల్లాలో అతి పెద్ద మండలం గా పేరు పొందిన ముదిగుబ్బ . బ్రిటిష్ కాలం లోనే ముదిగుబ్బ మీదుగా రైలు నడిపే వారు .అప్పట్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి మీటర్ గేజ్ మీద రైలు నడిచేవి .మారుతున్న కాలానికి అనుగుణంగా బ్రాడ్గేజ్ నిర్మించారు. దానితో పాటు ప్రస్తుతం డీజిల్ ఇంజన్లతో గుంతకల్ నుండి ముదిగుబ్బ మీదుగా ప్యాసింజర్ ,ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం ముదిగుబ్బ మీదుగా 11 ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అందులో నరసాపురం- ధర్మవరం ,ధర్మవరం- నరసాపురం ఎక్స్ ప్రెస్ రైలు కు మాత్రమే స్టాపింగ్ ఉంది .తిరుపతి- సికింద్రాబాదు గతంలో స్టాపింగ్ లేకపోవడంతో గత ప్రభుత్వ ఎంపీ నిమ్మల కిష్టప్ప కు మండల ప్రజలు మొర పెట్టుకోవడంతో తిరుపతి- సికింద్రాబాద్ రైలు ఆపే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే కరోనాకు ముందు సికింద్రాబాద్ నుండి తిరుపతి ,తిరుపతి నుండి సికింద్రాబాద్ కు వెళ్లే రైళ్లు స్టాపింగ్ ఉండేవి. ప్రస్తుతం రైళ్లు సమయం మార్పు చేయడంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైళ్లు ఆపకుండా పోవడం జరుగుతోంది .తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే రైళ్లు మాత్రమే ఆగుతాయి. అదేవిధంగా బొంబాయి -నాగర్ కోయిల్ ,నాగర్ కోయిల్- బొంబాయి వారంలో నాలుగు రోజులు నడుస్తున్నాయి .కరీంనగర్ -తిరుపతి ,తిరుపతి- కరీంనగర్ వారంలో రెండు రోజులు నడుస్తాయి. వాటితో పాటు మహారాష్ట్ర -తిరుపతి, తిరుపతి -మహారాష్ట్ర, మధురై -కాచిగూడ , పాకాల చేరుకొని మధురై చేరుతుంది .జిల్లాలో 48 వేల మంది కలిగి ఉన్న మండలం పెద్ద మండలం, నిత్యం మండలం నుండి పెద్ద ఎత్తున పుణ్యక్షేత్రమైన తిరుపతి, మధురై ,సికింద్రాబాద్ తదితర పట్టణాలకు అధికంగా వెళుతుంటారు. ప్రస్తుతం ఎంపీలు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య చొరవ తీసుకొని కేంద్ర రైల్వే మంత్రి ల తో చర్చించి ముదిగుబ్బలో ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపె విధంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు నడవక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు .ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి కి వెళ్లాలంటే ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపక పోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులతోపాటు విజయవాడ ,తిరుపతి తదితర పట్టణాల్లో చదువుతున్న విద్యార్థి, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు .ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లు ముదిగుబ్బ లో ఆగితే విద్యార్థులు రాకపోకలు సౌకర్యంగా ఉంటుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ముదిగుబ్బ రైల్వే స్టేషన్ మీదుగా 11 ఎక్స్ ప్రెస్ రైలు నడుస్తున్నప్పటికీ ఒకటి ,రెండు తప్ప స్టాపింగ్ లేవు. ప్రస్తుతం విద్యుత్తు లైను కూడా ఏర్పడడంతో రైలు ఆగుతాయని మండల వాసులు ఎంతో ఎదురు చూస్తున్నారు .ఇప్పటికైనా ఎంపీలు చొరవ తీసుకుని ముదిగుబ్బ మండల ప్రజలకు అనుకూలంగా ఉండడానికి ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిపే విధంగా కేంద్రం తో చర్చించి రైళ్లు ను ఆపాలని మండల ప్రజలు వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎక్స్ ప్రెస్ రైలు ఆగితే ఆదాయం బాగా పెరుగుతుంది—– డిప్యూటీ స్టేషన్ మాస్టర్
ముదిగుబ్బ మండలం నుండి సుధీర ప్రాంతాలకు అధిక సంఖ్యలో వెళుతున్నారని ముదిగుబ్బ రైల్వే స్టేషన్లో ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగితే రైల్వే కి ఆదాయం బాగా పెరుగుతుందని డిప్యూటీ స్టేషన్ మాస్టర్ సోమశేఖర్ తెలిపారు .తిరుపతి- సికింద్రాబాదు గతంలో ముదిగుబ్బలో స్టాపింగ్ ఉండేదని ,రైల్వే శాఖ అధికారులు సమయం మార్పు చేయడంతో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లే రైళ్లు ఆపడం లేదన్నారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు వెళ్లేటప్పుడు మాత్రమే ముదిగుబ్బ రైల్వే స్టేషన్ లో రైలు అవుతుందని తెలిపారు .బొంబాయి- నాగర్ కోయిల్ ,రైలు ముదిగుబ్బ స్టేషన్లో ఆపితే అనంతపురం నుండి తిరుపతి ,మధురై వరకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని, దాని వలన రైల్వే శాఖకు ఆదాయం కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు.