సత్యసాయి మహా సమాధి ని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.
పుట్టపర్తి రూరల్ శ్రీ సత్య సాయి సన్నిధి ప్రశాంతి నిలయం లో సత్యసాయిబాబా పదవ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. కోవిద్ నిబంధనల మధ్య భక్తులు మహాసమాధిని దర్శించుకున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు విద్యార్థుల వేదపఠనం, అనంతరం సంగీత విభావరి, నిర్వహించారు. సత్యసాయి కీర్తిస్తూ విద్యార్థుల పంచ కృతులు ఆలపించారు. సరికొత్త భజనలతో రూపొందించిన సి డి లను ట్రస్టు సభ్యులు రత్నాకర్, చక్రవర్తి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఆవిష్కరించారు. మహా మంగళహారతి , తదుపరి పెద్ద సంఖ్యలో ఆ సమాధి భక్తులు దర్శించుకున్నారు. స్థానిక సత్య సాయి భజన మండలి సభ్యులు పురవీధులలో సత్య సాయి పల్లకి సేవా ,నారాయణ సేవలు చేశారు. పలుచోట్ల భక్తులు సత్యసాయి చిత్రపటానికి ఘననివాళులర్పించారు. కమిషనర్ శివ రామ రెడ్డి, చైర్మన్ ఓబుల్ పతి , తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సత్య సాయి గ్లోబల్ కౌన్సిల్ ఆవిర్భావం..
విశ్వవ్యాప్తంగా ఉన్న సత్యసాయి సేవా సంస్థలు ఒక్కటి గా సమూహంగా ఏర్పాటు చేసే లక్ష్యంతో.. శ్రీ సత్య సాయి గ్లోబల్ కౌన్సిల్ ఏర్పాటు కు శ్రీకారం చుట్టినట్లు సత్యసాయి ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి. ఆరాధనోత్సవాల సందర్భంగా వెబ్ సైట్,నుండీ సభ్యత్వం ప్రారంభించారు. ద్వారాదీని ద్వారా ప్రపంచంలోని మారు మూల ప్రాంతాలకు సత్య సాయి సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించనున్నారు. గ్లోబల్ కౌన్సిల్ కార్యవర్గంలో రత్నాకర్ కీలక భూమిక పోషించనున్నారు. రాబోయే ఏడాదిలోగా ప్రపంచ స్థాయి సదస్సులు నిర్వహించడానికి.. షాపింగ్ సెంటర్ సమీపంలో కోట్లాది రూపాయలు వెచ్చించి, ఆడిటోరియం నిర్మిస్తున్నారు.