Monday, November 18, 2024

విద్యార్థి సంఘాలపై ఆదిమూలపు స్పందన..

అనంతపురంలో ఎయిడెడ్ కళాశాల విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి సంఘ‌ట‌న‌పై విద్యార్థి సంఘాలు విరుచుకు ప‌డుతున్నాయి. ఇవాళ విజయవాడ ఆర్ అండ్ బి భవనంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా, మీడియా సమావేశాన్ని అడ్డుకునేందుకు. విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. వీలుకాకపోవడంతో సమావేశం ముగిశాక మంత్రిని అడ్డగించి, ఘటనపై తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటు యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తే పదేవారు ఎలా భరిస్తారని మంత్రిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు ప్రతినిధులు మంత్రిపై వాగ్యుద్ధానికి దిగారు.

మంత్రి ఆదిమూలపు విద్యార్థి సంఘాల డిమాండ్లపై స్పందంచి, తాము నిజాయితీగా పనిచేస్తున్నామని, ఇచ్చిన మాట ఎక్కడైనా తప్పితే మీరు నిలదీయండి అని సూచించారు. అలాగే పోలీసుల లాఠీచార్జి వ్యవహారం తన విద్యాశాఖకు చెందిన విషయం కాదని, తన విద్యాశాఖకు సంబంధించిన సమస్యలపై తాను సమాధానం చెబుతానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement