అనంతపురం రాప్తాడు మండలం భోగినేపల్లిలో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఘటనను గంటలోపే ఛేదించారు. బలవంతంగా పెళ్లి చేయాలని సమీప బంధువులే కిడ్నాప్ నకు యత్నించారు. అనంతపురం పోలీసుల చాకచక్యంగా వ్యవహరించి ఈ ఘటనలో నలుగుర్ని అరెస్టు చేశారు. మైనర్ బాలికను తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. ఇంకొకరు అరెస్టు కావాల్సి ఉంది. ఈ ఘటనలో కమతం పుల్లన్న, కమతం సదానంద, బోయ కిష్ట, బుల్లె ప్రసాద్, వెన్నపూస భాస్కర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కిడ్నాప్ నకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఈవిషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే రాప్తాడు పోలీసులను ఆశ్రయించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు క్రైం నంబర్ 102/2022, 450 366(A) , 342 r/w 34 IPC & sec 11, 12 ఫోక్సో యాక్ట్ నమోదు చేశారు. ఈవిషయం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి దృష్టికి వెళ్లింది. హై అలెర్ట్ ద్వారా జిల్లాలోని పోలీసులందర్నీ ఎస్పీ అప్రమత్తం చేశారు. జిల్లా ఎస్పీ తన టెక్నికల్ విభాగం ద్వారా తానే స్వయంగా మానిటరింగ్ చేశారు. భోగినేపల్లి నుండీ హైవేలో అనంతపురం వైపు వచ్చిన కిడ్నాపర్లు తమకు సన్నిహితంగా ఉండే తపోవనం భాస్కర్ రెడ్డి ఇంటికి అమ్మాయితో సహా వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసు బృందాలు ఈ నలుగుర్ని అరెస్టు చేశారు. సదరు మైనర్ బాలికను సురక్షితంగా ఆ తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ ఘటనలోని బోయ కిష్ట అరెస్టు కావాల్సి ఉంది. మైనర్ బాలికకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎత్తుకెళ్లి తన కొడుకు కమతం సదానందకు ఇచ్చి పెళ్లి చేయాలనే దురుద్ధేశ్యంతో కిడ్నాప్ నకు పాల్పడినట్లు కమతం పుల్లన్న పోలీసుల విచారణలో వెల్లడించారు. కిడ్నాప్ ఘటన ఛేదింపులో పాల్గొన్న పోలీసు సిబ్బంది నుండి ఎస్సైలు, సి.ఐ లు, డీఎస్పీ, జిల్లా ఎస్పీ వరకు కృతజ్ఞతలు అంటూ ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులు హర్షం వెలిబుచ్చారు.
ప్రసంశ :
మైనర్ బాలిక కిడ్నాప్ ఘటన ఛేదించి ఆ అమ్మాయిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో శ్రమించిన అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసుల ఆధ్వర్యంలో సి.ఐ లు మురళీధర్ రెడ్డి, సి.ఐ లు జాకీర్ హుస్సేన్, రాఘవన్, కత్తి శ్రీనివాసులు, రవిశంకర్ రెడ్డి, విజయ భాస్కర్ గౌడ్, ఎస్సైలు రాఘవరెడ్డి, నభీరసూల్, జయపాల్ రెడ్డి, సుధాకర్ యాదవ్ లు, రాప్తాడు హెడ్ కానిస్టేబుళ్లు గిరి, వెంకటేష్, కానిస్టేబుల్ వారాధిలను జిల్లా ఎస్పీ అభినందించారు.