Wednesday, November 20, 2024

AP: అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. హాజరైన జిల్లా కలెక్టర్, జడ్జి, ఎస్పీలు

శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 21 (ప్రభన్యూస్) : పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా జడ్జి రాకేష్, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… 1959 అక్టోబర్ 21న పంజాబ్ రాష్ట్రానికి చెందిన డీఎస్‌పీ కరమ్‌సింగ్ ఆధ్వర్యంలో 21మందితో కూడిన సీఆర్‌పీ‌ఎఫ్ దళం భారత్- చైనా సరిహద్దుల్లో గస్తీ తిరుగుతోందన్నారు. ఇదే సమయంలో చైనా బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాయన్నారు. మన సీఆర్‌పీఎఫ్ దళం వారిని ధీటుగా ఎదుర్కొందన్నారు. ఈ ఘర్షణలో పది మంది భారత జవానులు ప్రాణాలు కోల్పోయారన్నారు వారి త్యాగాలను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు.

నిరంతరం విధి నిర్వహణలో దేశానికి కాపాడేవారు సైనికులు అయితే, అంతర్గత శక్తుల నుంచి ప్రజలను కాపాడి వారి ధన, ప్రాణాలకు భద్రత కల్పించేది పోలీసులన్నారు. సామాజిక ఆస్తుల రక్షణ కూడా వారి బాధ్యతేనన్నారు. పోలీసుల విధులు భిన్నంగా ఉంటాయన్నారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారన్నారు. పని గంటల్లో తేడా ఉంటుందన్నారు. మానసిక ఆరోగ్యం మీద ఒత్తిడి ప్రభావం చూపుతుందన్నారు. అనారోగ్యం సమస్యలు ఎదురవుతాయన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనేవారు విరామం లేకుండా విధులు నిర్వహిస్తారన్నారు. కొన్ని సందర్భాల్లో సిబ్బంది కొరత కారణంగా పోలీసులకు సెలవు కూడా దొరకదన్నారు.

అత్యవసర పరిస్థితుల్లోనూ విధి నిర్వహణలో ఉండాల్సి వస్తుందన్నారు. సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీఎఫ్, డీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, సివిల్, ట్రాఫిక్, క్రైం విభాగాల్లో విధి నిర్వహణలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశ సమగ్రతను, శాంతిభద్రతలను కాపాడుతున్నారన్నారు. ప్రజలు పోలీసులకు సహకారం అందించాలన్నారు. కాలుష్యం బారినపడి చనిపోతున్నారన్నారు. సమాచార వ్యవస్థను రూపొందించాలన్నారు. పోలీసులు కూడా సుఖవంతమైన, సౌకర్యవంతమైన జీవితం గడిపే విధంగా చూడడమే మన కర్తవ్యమన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులందరికీ ఘన నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement