Monday, November 25, 2024

తుమకుంట లో ప్రారంభమైన ఆక్షిజన్ ఉత్పత్తి

హిందూపురం అర్బన్ – హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామికవాడలో మరమ్మతులతో నిలిచిపోయిన ఆక్సిజన్ ప్లాంట్ ను ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభమైంది. ప్లాంట్‌లో ఉత్పత్తి ఆగిపోవడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ఆనంతపురం నుంచి ఆక్సిజన్ సిలెండర్లు తెప్పించుకుంటుండేవారు. గత నాలుగు రోజులుగా ఆక్సిజన్ సిలెండర్లు పూర్తీగా లేకపోవడంతో పాజిటివ్ వచ్చిన బాదితులను అడ్మిట్ చేసుకునేందుకు కూడా వైద్యులు నిరాకరించారు. అయితే ఆదివారం నుంచి ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి రోజూ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి 500 నుంచి 600 సిలెండర్లు ఉత్పత్తి అవుతుందని వీటిని హిందూపురం చుట్టుపక్కల ఆసుపత్రులతోపాటు జిల్లాలోని ఆసుపత్రులకు పంపుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement