అనంతపురం క్రైమ్ – ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, తరచూ శానిటైజర్ వాడాలని సబ్బుతో చేతులు అరగంటకు ఒకసారి శుభ్రం చేసుకోవాలని, కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని త్రీటౌన్ సీఐ రెడ్డప్ప వాహనచోదకులకు సూచించారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీలిమ సర్కిల్ తపోవనం సర్కిల్ మొదటి రోడ్డు ప్రాంతాలలో వాహనచోదకులకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు నగర డీఎస్పీ వీర రాఘవ రెడ్డి పర్యవేక్షణలో సిఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో.. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని సూచించారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యం వీడాలని మాస్కు తప్పని సరిగా ధరించాలి తరచూ సోపుతో చేతులు అరగంటకి ఒక్క సారి శుభ్రంగా కడుక్కోవాలినీ తరచూ శానిటైజర్ వాడాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుం విధించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement