Friday, November 8, 2024

Sri Sathya Sai Dt.| చిరుత క‌ల‌క‌లం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, శ్రీ సత్యసాయి : శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండలంలోని పలు గ్రామాల్లో చిరుత‌పులి సంచ‌రించ‌డంతో ప‌లువురు ఆందోళ‌న చెందుతున్నారు. మూడు రోజుల క్రితం ఒక చిరుత బొమ్మిరెడ్డి పల్లి వద్ద రాత్రి 9 గంటల సమయంలో రోడ్డు దాటుతూ కనిపించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి గ్రామస్తుల‌కు కంటి మీద కునుకు ఉండ‌డం లేదు. ప‌శువులు మేపుకోవ‌డానికి అట‌వీ ప్రాంతానికి తీసుకువెళ్ల‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. బొమ్మిరెడ్డిపల్లి, రాట్నాలపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల ప్రజలకు రాత్రి వేళ ఒంట‌రిగా తిరగొద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఆదివారం రాత్రి క‌నిపించిన చిరుత‌

తాజాగా ఆదివారం రాత్రి కూడా బొమ్మిరెడ్డి పల్లి సమీపంలోని చెరువు వద్ద రెండు పెద్ద చిరుతలు, మూడు చిన్న చిరుతలు సంచరిస్తున్నట్లు ప్ర‌జ‌ల కంట‌ప‌డింది. దీంతో మరోసారి గ్రామస్తులు పెద్దగా కేకలు వేసుకుంటూ వాటిని అడవుల్లోకి పారిపోయే విధంగా చేశారు. అటవీ శాఖ అధికారులు ఈ విషయంలో పూర్తిగా దృష్టి పెట్టి చిరుతల సంచారాన్ని లేకుండా చేసి, వాటిని అడవుల్లోకి తరిమి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement